Breaking News

ముక్కంటిని మనువాడిన 27 ఏళ్ల యువతి.. ఎందుకంటే..?

Published on Tue, 07/25/2023 - 12:50

లక‍్నో: పచ్చని పందిళ్లు, మేలతాళాలు, వేదమంత్రాలు, బంధువుల చిరునవ్వులు, ఏ లోటు రాకుండా చూసుకోవాలనుకునే కుటుంబ సభ్యుల హడావిడి మధ్య పెళ్లిమండపానికి సిగ్గు పడుతూ వస్తోంది వధువు. ఇదంతా చెబుతుంటే ఎవరిదో వివాహం అని అర్థమవుతోంది కదా..! కానీ ఇది మీరు పురాణాల్లో తప్పా మరెక్కడా చూడని పెళ్లి. భక్తితో పరమ శివున్నే వివాహం చేసుకున్నది ఓ యువతి.. ఏంటో ఈ కథ తెలుసుకుందాం పదండి..  

మంచి వరుడు కావాలని ప్రతి యువతి కలలు కంటుంది. ఏ దుర్గునాలు లేని వాడితో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడతారు. అయితే.. మనుషుల్లో అలాంటివారు ఉండరనుకుందో ఏమో? కానీ ఓ యువతి ఏకంగా ముక్కంటినే వివాహం చేసుకుంది. పరమేశ్వరుని మీద భక్తితో శివలింగాన్నే వరునిగా భావించి మనువాడింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

శివుని సేవలోనే..
ఝాన్సీలో అన్నపూర్ణ కాలనీకి చెందిన యువతి తన తల్లిదండ్రులతో జీవిస్తోంది. వారి కుటుంబమంతా చాలా ఏళ్లుగా బ్రహ్మకుమారి సంస్థతో అనుసంధానమై ఉన్నారు. అనునిత్యం శివుడి సేవలో ఉన్న యువతి.. అపారమైన భక్తి విశ్వాసాలను పెంచుకుంది. దీంతో శివుడినే వివాహమాడుతానని తల్లిదండ్రులకు తెలిపింది. వారు కూడా అందుకు అంగీకరించడంతో యువతి అభీష్టం నెరవేరింది.

నెలరోజుల ముందే..
పెళ్లికి నెలరోజుల ముందే వారి కుటుంబమంతా అన్ని ఏర్పాట్లు చేసింది. పెళ్లిమండపాలు వెయించడం, బంధువులకు పత్రికలు పంచడం, పెళ్లి బట్టలు ఖరీదు చేయడం ఇలా అన్నీ పనులు మనుషుల పెళ్లికి చేసినట్లు చేశారు. మేలతాళాల చప్పుళ్లతో బంధువుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఈ విభిన్నమైన వివాహాన్ని చూడటానికి చుట్టపక్కల ప్రాంతాల ప్రజలు ఆసక్తికనబరిచారు.

ఇదీ చదవండి: మత్స్యకారుల చేతికి డాల్ఫిన్‌.. ఇంటికెళ్లి కూర వండేసుకున్నాక..

Videos

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..!

LIVE: YSRకు జగన్ నివాళులు

దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి

ఇరుముడి OTTలోకి ఎప్పుడు.?

లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం

Kapra Lake: గణేష్ విగ్రహాల నిమజ్జనంపై వివాదం..

తెనాలిలో వ్యాపారి కిడ్నాప్ కేసు విషాదాంతం

చంద్రబాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు హెచ్చరిక

సభలో అందరిముందు జనసేన గాలి తీసిన బాబు..

Idupulapaya: YSR ఘాట్‌ వద్ద జగన్‌ నివాళులు

Photos

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)