Breaking News

Video: కోర్టులో జడ్జితో గొడవ.. లాయర్లను తరిమిన పోలీసులు

Published on Tue, 10/29/2024 - 15:56

ఘ‌జియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఘ‌జియాబాద్ జిల్లా కోర్టులో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ కేసు విచారణ సమయంలో జడ్జికి, ఓ న్యాయవాదికి మధ్య వివాదం తలతెత్తడంతో కోర్టు రణరంగంగా మారింది.  చివరకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. కోర్టులో గొడవకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఘజియాబాద్‌ జిల్లా కోర్టులో ఓ బెయిల్ పిటీష‌న్ విష‌యంలో.. జడ్జితో, లాయర్‌ మ‌ధ్య వాగ్వాదం జరిగింది. ఇది చివరకు గొడవకు దారితీసింది. వెంటనే భారీ సంఖ్యలో లాయర్లు జ‌డ్జీ ఛాంబ‌ర్ వ‌ద్ద గుమిగూడి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆందోళ‌న చేప‌ట్టిన అడ్వ‌కేట్ల‌ను త‌రిమేందుకు పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు. ప‌రిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నించారు.  కూర్చీలు పట్టుకొని మ‌రీ లాయ‌ర్లను బయటకు త‌రిమేశారు. ఆ త‌ర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పారామిలిట‌రీ ద‌ళాలు కూడా కోర్టు ఆవ‌ర‌ణ‌కు చేరుకున్నాయి.

ఈ ఘటనలో పలువురు న్యాయవాదులకు గాయాలైనట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ వివాదంపై చర్చించేందుకు బార్‌ అసోసియేషన్‌ సమావేశానికి పిలపునిచ్చింది. తమను జడ్జి ఛాంబర్ నుంచి బయటకు గెంటేసిన తరువాత న్యాయవాదులంతా కోర్టు బయట ధర్నా చేపట్టారు. జడ్జికి, సెక్యూరిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)