Breaking News

కర్వా చౌత్‌ వేళ.. భర్త వీపుపై భార్య అమూల్య సందేశం

Published on Mon, 10/21/2024 - 11:23

హల్ద్వానీ: కర్వా చౌత్ వ్రతాన్ని ఉత్తరాది మహిళలు ఆదివారం(అక్టోబర్ 20)న  అత్యంత వేడుకగా జరుపుకున్నారు. ఉత్తరాఖండ్‌లోనూ ఇంటింటా కర్వాచౌత్‌ సందడి కనిపించింది. అయితే హల్ద్వానీ నగరంలో ఈ పండుగ సందర్భంగా చోటుచేసుకున్న ఒక విచిత్ర ఉదంతం అందరినీ ఆకర్షించింది. ఒక మహిళ తన భర్త వీపుపై గోరింటతో ‘వైద్య కళాశాల ఆస్తి’ అని రాశారు. దీని వెనుక ఆమె ఉద్దేశమేమిటనే విషయానికొస్తే..

హల్ద్వానీలోని కుంతీపురం హిమ్మత్‌పూర్ తల్లా నివాసి గీతా మిశ్రా శరీర దాన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందుకే కర్వాచౌత్‌ సందర్భంగా తన భర్త వీపుపై మెహెందీతో ‘మెడికల్ కాలేజీ ఆస్తి’ అని రాసి, తమ సందేశాన్ని అందరికీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరణానంతరం శరీరాన్ని ఏదైనా ఉపయోగకరమైన పనులుకు వినియోగించాలన్నారు. హల్ద్వానీ వైద్య కళాశాలకు మృత శరీరాన్ని  అప్పగిస్తే, వైద్య విద్యార్థులు ప్రయోగాలకు ఉపయోగపడుతుందన్నారు. ఇంతేకాదు.. మరణించ తరువాత కూడా మన శరీరం సదుపయోగం అవుతుందని పేర్కొన్నారు.  

గీతా మిశ్రా భర్త డాక్టర్ సంతోష్ మిశ్రా మాట్లాడుతూ 2013లోనే తమ కుటుంబ సభ్యులంతా దేహదానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారన్నారు. ఇలాగే తాము నేత్రదానం, అవయవదానం మొదలైనవాటిపై ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. ఈ దిశగా ఆలోచించేవారు మరిన్ని వివరాల కోసం వారికి సమీపంలోగల మెడికల్‌ కాలేజీలను సంప్రదించాలని మిశ్రా సూచించారు.
 

ఇది కూడా చదవండి: ‘కర్వా చౌత్‌’ హామీని విస్మరించిన భర్తపై ఫిర్యాదు

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)