Breaking News

విరిగిపడిన కొండచరియలు.. గంగోత్రి హైవే బంద్‌

Published on Sun, 07/21/2024 - 12:09

ఉత్తరాఖండ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్లు ప్రమాదాలు  చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొండచరియలు విరిగిపడుతూ జనాలను భయకంపితులను చేస్తున్నాయి. తాజాగా ఉత్తరకాశీలోని గంగోత్రి జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రహదారిని మూసివేశారు.

దీంతో ఉత్తరకాశీలోని మనేరి, భట్వాడిల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బార్డర్‌ రోడ్డు ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) బృందం ఈ హైవేపై పడిన రాళ్లు, శిధిలాలను తొలగించేపని చేపట్టింది. వీలైనంత త్వరగా రహదారిని క్లియర్‌ చేసేందుకు ప్రయత్నిస్తోంది.  మరోవైపు ఉత్తరాఖండ్‌లోని అల్మోరా, బాగేశ్వర్, చమోలీ, చంపావత్, గర్వాల్, హరిద్వార్, నైనిటాల్, పిథోరాఘర్, రుద్రప్రయాగ్, తెహ్రీ గర్వాల్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లో ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి  ఉత్తరాఖండ్‌లోని పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున కేదార్‌నాథ్‌లోని గౌరీకుండ్‌ సమీపంలో రాళ్లు పడడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. దీనికిముందు జూలై ప్రారంభంలో బద్రీనాథ్ మార్గంలో  కొండచరియలు విరిగిపడిన ఉదంతాలు చోటుచేసుకున్నాయి. దీంతో అప్పట్లో బద్రీనాథ్ మార్గాన్ని కూడా మూసివేశారు. అయితే బీఆర్‌ఓ బృందం శిధిలాలు, రాళ్లను తొలగించడంతో ఆ రహదారిని తిరిగి తెరిచారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)