Breaking News

దివి నుంచి నిర్విఘ్నంగా భువికి..

Published on Mon, 08/25/2025 - 05:57

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గగన్‌యాన్‌ ప్రాజెక్టు’లో అత్యంత కీలకమైన ‘క్రూ మాడ్యూల్‌ ఎయిర్‌ డ్రాప్‌ టెస్ట్‌’విజయవంతమైంది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు తిరిగి భూమిని చేరే సమయంలో వారు ప్రయాణించే మాడ్యూల్‌ను సురక్షితంగా నేలకు దింపటంలో నైపుణ్యాన్ని సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహించారు. ఇస్రో, డీఆర్డీఓ, ఎయిర్‌ఫోర్స్, నేవీ, కోస్ట్‌గార్డ్‌ ఈ ప్రయోగంలో పాలుపంచుకున్నాయి. ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్‌ ద్వారా డమ్మీ మాడ్యూల్‌ను ఆదివారం భూమికి 35 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి జారవిడిచారు. 

అది భూ ఉపరితలానికి మూడు కిలోమీటర్ల సమీపానికి చేరుకోగానే అందులోని పారాచ్యూట్‌ తెరుచుకుంది. దీంతో మాడ్యూల్‌ వేగం నిర్దేశిత స్థాయికి నియంత్రించబడి బంగాళాఖాతంలో సురక్షితంగా దిగింది. దానిని కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది మెషీన్‌ బోట్ల ద్వారా ఒడ్డుకు చేర్చింది. ఇంటిగ్రేటెడ్‌ ఎయిర్‌ డ్రాప్‌ టెస్ట్‌ (ఐఏడీటీ–01)గా పిలుస్తున్న ఈ ప్రయోగం ఇస్రోకు మొదటిది. గగన్‌యాన్‌లో భాగంగా ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి జీ–1 పేరుతో ప్రయోగాత్మక పరీక్షకు ఇస్రో సిద్ధమవుతోంది. 2035 నాటికి వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి తిరిగి భూమికి సురక్షితంగా తీసుకురావాలని నిర్ణయించింది. 

అంతరిక్షంలో భారతీయ స్పేస్‌ స్టేషన్‌ (బీఎస్‌ఎస్‌) నిర్మాణానికి ఇప్పటికే స్పేడెక్స్‌ ఉపగ్రహాలను ప్రయోగించి డాకింగ్, అన్‌ డాకింగ్‌ ప్రక్రియలను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈలోపు గగన్‌యాన్‌కి సంబం«ధించి పలు పరీక్షలు చేపట్టనున్నారు. అందులో భాగంగానే శ్రీహరికోటలోని షార్‌ నుంచి తాజాగా క్రూ మాడ్యూల్‌ ఎయిర్‌ డ్రాప్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఈ ప్రయోగం క్రూ మాడ్యూల్‌లోని వివిధ పరికరాలు, ప్యారాచూట్‌ సమర్థత, పనితీరుతోపాటు వ్యోమగాములను సురక్షితంగా తీసుకురావడానికి కావాల్సిన పరిస్థితుల అధ్యయనానికి దోహదపడుతుందని ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)