‘జాతీయ భద్రతా సలహా మండలి’సభ్యుడిగా సతీశ్‌ రెడ్డి

Published on Wed, 06/11/2025 - 04:51

సాక్షి, న్యూఢిల్లీ: డీఆర్‌డీఓ మాజీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ జి.సతీశ్‌ రెడ్డిని జాతీయ భద్రతా మండలి సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ నేతృత్వంలో ‘జాతీయ భద్రతా సలహా మండలి’లో సభ్యుడిగా మంగళవారం నుంచి రెండేళ్ల పాటు, అంటే 2027 జూన్‌ 9వ తేదీ వరకు సతీశ్‌రెడ్డి  కొనసాగనున్నారు.  ఈ మేరకు జాతీయ భద్రతా మండలి సచివాలయ డిప్యూటీ సెక్రటరీ పుష్పేందర్‌ కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లాలోని మహిమలూరులో 1963 జూలై 1న జన్మించిన సతీశ్‌ రెడ్డి 1986లో డిఫెన్స్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ లేబొరేటరీలో శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు.

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌లో అనంతపురం జేఎన్‌టీయూ నుంచి పట్టభద్రుడయ్యారు. అనంతరం హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో ఎంఎస్, పీహెచ్‌డీ పూర్తి చేశారు.పరిశోధనా సంస్థ ఇమారత్‌ (ఆర్‌సీఐ) డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ కాలంలో ఐఆర్‌ సీకర్స్, ఇంటిగ్రేటెడ్‌ ఏవి యానిక్స్‌ మాడ్యూల్స్, ఇతర వినూత్న వ్యవస్థల అభి వృద్ధిని పర్య వేక్షించారు. 2015 లో రక్షణ మంత్రి సాంకేతిక సలహా దా రుగా నియమి తులయ్యారు.

2018 ఆగస్టు లో డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవల ప్‌మెంట్‌ ఆర్గనై జేషన్‌ (డీఆర్‌ డీవో) 13వ చైర్మన్‌గా నియమితులయ్యారు. క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల అభివృద్ధి డైరెక్టర్‌ జనరల్‌గా ఇండియన్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ ప్రోగ్రామ్‌ను పర్యవేక్షించారు. నాగ్, క్యూఆర్‌ఎస్‌ఏఎం, రుద్రమ్, దీర్ఘశ్రేణి గైడెడ్‌ బాంబ్‌ల అభివృద్ధిలో కీలక భూమిక పోషించారు. విజయవంతమైన పృథ్వీ డిఫెన్స్‌ వెహికిల్‌ తొలి పరీక్షను పర్యవేక్షించారు. 2018 నుంచి 2022 డీఆర్‌డీవో చైర్మన్‌గా  సేవలందించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)