Breaking News

130వ రాజ్యాంగ సవరణపై మరిన్ని సంప్రదింపులు 

Published on Sat, 07/18/2026 - 05:25

న్యూఢిల్లీ: తీవ్రమైన ఆరోపణలపై నిర్బంధానికి గురైన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను పదవుల నుంచి తొలగించే బిల్లును పరిశీలిస్తున్న పార్లమెంటరీ ఉమ్మడి కమిటీ సమావేశంలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ఈ కమిటీ చేసిన ఐదు సిఫార్సులలో ఒక్కో దానిపై ఓటింగ్‌ జరపగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో, ముసాయిదా నివేదిక ఆమోదాన్ని వాయిదా వేయాలని కమిటీ నిర్ణయించింది.130వ రాజ్యాంగ సవరణపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఐదు సిఫార్సులు చేసింది. వీటి ప్రతులను కమిటీ సభ్యులకు అందజేసింది. 

.శుక్రవారం ఈ సిఫారసులపై వేర్వేరుగా ఓటింగ్‌ చేపట్టింది. వీటిపై సంబంధిత వర్గాలతో మరిన్ని సంప్రదింపులు అవసరమన్న అభిప్రాయాన్ని సభ్యులు వ్యక్తపరిచారు. కమిటీలోని ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎన్‌సీపీ(ఎస్‌పీ)కి చెందిన ఎంపీ సుప్రియా సూలే అసమ్మతిని వ్యక్తపరిచారు. అయితే, నివేదిక ఆమోదాన్ని వాయిదా వేయాలని కమిటీ నిర్ణయించడంతో అసమ్మతిని వాపసు తీసుకుంటున్నట్లు అనంతరం వీరిద్దరూ ప్రకటించారు. 130వ రాజ్యాంగ సవరణ ప్రతిపాదనపై సంబంధిత వర్గాలతో మరిన్ని సంప్రదింపులు చేపట్టాల్సిన అవసరముందని కమిటీ ఏకాభిప్రాయంతో ఉందని బీజేపీకి చెందిన కమిటీ చీఫ్‌ అపరాజిత సారంగి తెలిపారు.  

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)