Breaking News

ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టుల మృతి

Published on Sun, 01/18/2026 - 05:10

చర్ల: ఛత్తీస్‌గఢ్‌–మహారాష్ట్ర సరిహద్దుల్లోని నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల ఘటనల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ విషయాన్ని బీజాపూర్‌ జిల్లా ఎస్పీ జితేంద్రకుమార్‌ యాదవ్‌ మీడియాకు వెల్లడించారు. నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతం పరిధిలోని కందాలపర్తి, సక్మెట్ట గ్రామాల సమీపంలో మావోయిస్టు పార్టీ పశ్చిమ బస్తర్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి పాపారావు, డీవీసీఎం మెంబర్‌ దిలీప్‌తోపాటు 100 మందికిపైగా మావోయిస్టులు సంచరిస్తున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో బీజాపూర్‌ జిల్లాకు చెందిన డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సీఆర్‌పీఎఫ్‌ విభాగాల బలగాలు శుక్రవారం సాయంత్రం నుంచి కూంబింగ్‌ చేపట్టాయి.

శనివారం ఉదయం బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు మొదలుపెట్టగా బలగాలు సైతం ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో తొలుత డివిజనల్‌ కమిటీ సభ్యుడు దిలీప్‌ బెడ్జాతోపాటు మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు కోసా మడివి మృతిచెందారు. మరికొందరు గాయపడ్డప్పటికీ తప్పించుకున్నారు. ఘటనా స్థలంలో ఒక ఏకే 47తోపాటు పేలుడు పదార్థాలను బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. ఎదురుకాల్పుల ఘటన నుంచి పలువురు మావోయిస్టులు తప్పించుకోవడంతో వారి కోసం అదనపు బలగాలతో కూంబింగ్‌ను విస్తృతం చేశారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడటంతో బలగాలు జరిపిన కాల్పుల్లో మరో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు ఉండగా వారిని గుర్తించాల్సి ఉందని ఎస్పీ జితేంద్రకుమార్‌ యాదవ్‌ తెలిపారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)