ఆ మట్టి.. ఆ నీరు

Published on Sat, 12/28/2024 - 05:49

శ్రీకృష్ణుడికి అటుకులు తీసుకొచ్చిన బాల్యమిత్రుడు కుచేలుడి కథ అందరికీ తెలిసిందే. అలాంటిదే డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ (Manmohan Singh) జీవితంలోనూ జరిగింది. అవిభాజ్య భారత్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఉన్న గాహ్‌ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) అనే గ్రామంలో సింగ్‌ జన్మించారు. పాఠశాల చదువు అక్కడే పూర్తి చేశారు. 1947 విభజన తరువాత కుటుంబం భారత్‌కు వచ్చింది. కానీ ఆయన బాల్యమంతా ఆ గ్రామంతోనే ముడిపడి ఉంది. స్నేహితులు అక్కడే ఉండిపోయారు. 

2004లో ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ వార్త స్వగ్రామానికి చేరకుండా ఉంటుందా? మిత్రులంతా ఆయనను గుర్తు చేసుకున్నారు. మన్మోహన్‌సింగ్‌కు ప్రాణమిత్రుడైన రాజా మహమ్మద్‌ అలీకి చిన్ననాటి స్నేహితుడు మన్మోహన్‌ను కలవాలనిపించింది. ఆయన చిన్నతనంలో మన్మోహన్‌సింగ్‌ను అలాగే పిలిచేవారు. తన సామర్థ్యం మేరకు కానుకలను పట్టుకుని 2008 మే నెలలో ప్రధాని నివాసానికి వచ్చారు. తనను కలవడానికి వచ్చిన చిరకాల మిత్రుడు అలీకి మన్మోహన్‌ మరిచిపోలేని ఆతిథ్యమిచ్చారు. 

అప్పుడు ఇద్దరిదీ డెబ్బై ఏళ్ల వయసు. కానీ బాల్య జ్ఞాపకాలతో ఇద్దరి కళ్లు మెరిసిపోయాయి. ఆ పూటంతా జ్ఞాపకాలతో గడిచిపోయింది. మిత్రుడికి తలపాగా, శాలువాతోపాటు టైటాన్‌ వాచ్‌ను తన గుర్తుగా ఇచ్చారు మన్మోహన్‌. ఇక అలీ తిరిగి వెళ్తూ.. మన్మోహన్‌కోసం తీసుకొచ్చిన ఊరి మట్టిని, నీటిని, గాహ్‌ ఫొటోను బహూకరించాడు. స్నేహంకోసం మట్టిని ఎల్లలు దాటించి ఒక మిత్రుడు తీసుకొస్తే.. సరిహద్దులు ఎన్నున్నా స్నేహం ఎల్లకాలం ఉంటుందనడానికి గుర్తుగా గడియారాలను పంపారు. అలా బాల్యమిత్రులు ఒకరిపై ఒకరి ప్రేమను చాటుకున్నారు. 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)