Breaking News

సీఐసీగా ఆర్‌కే గోయెల్‌ ప్రమాణ స్వీకారం 

Published on Tue, 12/16/2025 - 05:51

న్యూఢిల్లీ: ప్రధాన సమాచార కమిషనర్‌(సీఐసీ)గా మాజీ ఐఏఎస్‌ అధికారి రాజ్‌ కుమార్‌ గోయెల్‌ మరో 8 మంది సమాచార కమిషనర్ల నియామకంతో కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పూర్తి సామర్థ్యం సంతరించుకుంది. ప్రధాని మోదీ సారథ్యంలో హోం మంత్రి అమిత్‌ షా, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీలతో కూడిన ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ గత వారం వీరిని ఎంపిక చేసి, రాష్ట్రపతికి సిఫారసు చేయడం తెల్సిందే. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్‌ కుమార్‌ గోయెల్‌ తదితరులతో ప్రమాణం చేయించారు. 

కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర కుమార్‌ పాల్గొన్నారు. సీఐసీ సారథ్యంలోని ఈ కమిషన్‌లో గరిష్టంగా 10 మంది సమాచార కమిషనర్లకు గాను ప్రస్తుతం ఇద్దరు కమిషనర్లు మాత్రమే పని చేస్తున్నారు. తాజా నియామకాలతో దాదాపు తొమ్మిదేళ్లకు సీఐసీ పూర్తిస్థాయిలో పనిచేయనుంది. సోమవారం కమిషనర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో జయ వర్మ సిన్హా, స్వాగత్‌ దాస్, సంజీవ్‌ కుమార్‌ జిందాల్, సురేంద్ర సింగ్‌ మీనా, కుష్వంత్‌ సింగ్‌ సేథి, పీఆర్‌ రమేశ్, అశుతోష్‌ చతుర్వేది, సుధారాణి రేలంగి ఉన్నారు.   
 

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి