Breaking News

డిసెంబరులో పట్టాలపైకి వందేభారత్‌ స్లీపర్‌ రైలు

Published on Sat, 08/24/2024 - 09:55

భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన వందేభారత్‌ రైళ్లకు ప్రయాణికుల నుంచి అమితమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ కొత్తగా వందే భారత్‌ స్లీపర్‌ రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఈ  ఏడాది డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి రానుంది.

2019లో  వందేభారత్‌ చైర్-కార్ రైలును ప్రారంభించారు. ఇప్పుడు వస్తున్న వందేభారత్‌ స్లీపర్‌  రైలు ఈ సిరీస్‌లో మూడవ ఎడిషన్. మొదటి వందే భారత్ స్లీపర్ రైలు గుజరాత్‌లో నడపాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. అధికారికంగా ఇంకా దీనిపై స్పష్టత రాలేదు. ఈ రైలును రెండు నెలల పాటు పరీక్షించనున్నారు.

వందే భారత్ తొలి స్లీపర్ రైలు బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఇఎంఎల్) ప్లాంట్ నుండి సెప్టెంబర్ 20 నాటికల్లా బయలుదేరుతుందని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐపీఎఫ్) చెన్నై జనరల్ మేనేజర్ యూ సుబ్బారావు మీడియాకు తెలిపారు. దీని తర్వాత రైలు ట్రయల్ రన్ జరగనుంది. వాయువ్య రైల్వే జోన్‌లో హైస్పీడ్ రైలు ట్రయల్‌ను నిర్వహించనున్నారు.

స్లీపర్‌ వందేభారత్‌లో స్టెయిన్‌లెస్ స్టీల్ కార్ బాడీ, ప్రయాణీకులకు మెరుగైన రక్షణ సదుపాయాలు, జీఎఫ్‌ఆర్‌పీ ఇంటీరియర్ ప్యానెల్‌లు, ఏరోడైనమిక్ డిజైన్, మాడ్యులర్ ప్యాంట్రీ, ఫైర్ సేఫ్టీ కంప్లైయెన్స్, డిసేబుల్డ్ ప్యాసింజర్‌ల సౌకర్యాలు, ఆటోమేటిక్ డోర్లు, సెన్సార్ ఆధారిత ఇంటర్‌కమ్యూనికేషన్, ఫైర్ బారియర్ డోర్లు ఉన్నాయి. యూఎస్‌బీ ఛార్జింగ్‌తో కూడిన ఎర్గోనామిక్ టాయిలెట్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్ కూడా దీనిలో ఉండనున్నాయి.

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు