Breaking News

తొలి విడత నోటిఫికేషన్‌ జారీ.. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు

Published on Thu, 03/21/2024 - 05:34

సాక్షి, న్యూఢిల్లీ:  తొలి విడత సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 19న తొలి విడత ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు, తమిళనాడులోని విలవన్‌కోడ్, త్రిపురలోని రామ్‌నగర్‌ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను సైతం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 28న నామినేషన్లను పరిశీలిస్తారు.

ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. బిహార్‌లో మాత్రం స్థానిక వేడుక నేపథ్యంలో నామినేషన్లకు ఈ నెల 28వ తేదీ వరకు గడువు విధించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరుగనున్న సంగతి తెలిసిందే. తొలి విడతలో అత్యధికంగా తమిళనాడులో 39 స్థానాలు, రాజస్తాన్‌లో 12, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఐదు స్థానాల చొప్పున, బిహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో రెండు స్థానాల చొప్పున, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, నాగా లాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్‌ నికోబార్, జమ్మూకశ్మీర్, లక్షదీ్వప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరుగనుంది.     

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)