Breaking News

2026 ఏప్రిల్‌ 1 నుంచి తొలిదశ జనగణన

Published on Mon, 06/30/2025 - 03:43

న్యూఢిల్లీ: దేశ చరిత్రలో 16వ జన గణన, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 8వ జన గణనకు రంగం సిద్ధమవుతోంది. 2026 ఏప్రిల్‌ 1 నుంచి జన గణన అధికారికంగా ప్రారంభం కానుంది. జనాభా లెక్కల సేకరణ వీలుగా పరిపాలనా యూనిట్ల సరిహద్దుల్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే ఈ ఏడాది డిసెంబర్‌ 31వ తేదీలోగా ప్రతిపాదించాలని కేంద్రం సూచించింది. జన గణన ప్రక్రియకు మార్పులు చేసిన పరిపాలనా యూనిట్లను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. డిసెంబర్‌ 31న సరిహద్దులు ఖరారు చేస్తామన్నారు.

ఈ మేరకు రిజి్రస్టార్‌ జనరల్, సెన్సెస్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా మృత్యుంజయ్‌ నారాయణ్‌ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, పట్టణాలను ఏకరూప ఎన్యూమరేషన్‌ బ్లాక్‌లుగా విభజించనున్నట్లు తెలిపారు. ఒక్కో బ్లాక్‌కు ఒక ఎన్యూమరేటన్‌ను నియమిస్తారు. జనాభా లెక్కల సేకరణలో పొరపాట్లు జరగకుండా వీరు చర్యలు తీసుకుంటారని వివరించారు. 3 నెలల్లోగా జన గణన పూర్తిచేయాల్సి ఉంటుంది.

2027 మార్చి 1వ తేదీ లోగా రెండు దశల్లో జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో హౌజ్‌లిస్టింగ్‌ ఆపరేషన్, రెండో దశలో పాపులేషన్‌ ఎన్యూమరేషన్‌ నిర్వహిస్తారు. హౌస్‌ లిస్టింగ్‌ ఆపరేషన్‌ 2026 ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి జన గణనతోపాటు కుల గణన కూడా చేపట్టనున్నారు. ఎన్యూమరేషన్‌ బ్లాక్‌లు ఖరారైన తర్వాత పరిపాలనా యూనిట్ల సరిహద్దుల్లో మార్పులు చేయడానికి వీలుండదు. దేశంలో చివరిసారిగా 2011లో జన గణన జరిగింది. మళ్లీ 16 ఏళ్ల తర్వాత.. 2027లో జరగబోతోంది.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)