Breaking News

kargil: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ సరికొత్త రికార్డు

Published on Sun, 01/07/2024 - 12:16

లడాఖ్‌: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌(ఐఏఎఫ్‌) సరికొత్త రికార్డు నెలకొల్పింది. హిమాలయాల్లో ఎనిమిది వేల అడుగుల ఎత్తులో ఉన్న కార్గిల్‌ ఎయిర్‌ స్ట్రిప్‌పై సి-130జె విమానాన్ని  ఎయిర్‌ఫోర్స్‌ తొలిసారిగా నైట్‌ల్యాండింగ్‌ చేసింది. ‘ఇటీవలే ఐఏఎఫ్‌ సి-130ని కార్గిల్‌ ఎయిర్‌ స్ట్రిప్‌లో తొలిసారి విజయవంతంగా రాత్రివేళ ల్యాండ్‌ చేశాం’అని ఐఏఎఫ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

ఐఏఎఫ్‌ ప్రత్యేక బలగాల యూనిట్‌ ద గార్డ్స్‌ శిక్షణను కూడా ఈ ఫీట్‌లో భాగంగా ఐఏఎఫ్‌ కలిపి నిర్వహించడం విశేషం. నైట్‌ ల్యాండింగ్‌కు సంబంధించి మరిన్ని వివరాలను ఐఏఎఫ్‌ వెల్లడించలేదు. హిమాలయాల్లో 8800 మీటర్ల ఎత్తులో ఉన్న కార్గిల్‌ ఎయిర్‌ స్ట్రిప్‌లో విమానాలను ల్యాండ్‌ చేయడం పైలట్లకు సవాళ్లతో కూడుకున్న టాస్క్‌.అత్యంత ఎత్తుతో పాటు ప్రతికూల వాతావరణంలో విమానాలను ల్యాండ్‌ చేయాలంటే పైలట్లకు ప్రత్యేక నైపుణ్యాలు ఉండాల్సిందే.

గత ఏడాది నవంబర్‌లోనూ ఐఏఎఫ్‌ ఉత్తరాఖండ్‌లో ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఎయిర్‌ స్ట్రిప్‌పై లాక్‌హిడ్‌ మార్టిన్‌కు చెందిన సూపర్‌ హెర్క్యులస్‌ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్‌ విమానాన్ని విజయవంతంగా నైట్‌ ల్యాడింగ్‌ చేసింది. ఉత్తర కాశీ టన్నెల్ కూలిన ఘటనలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకుగాను ఈ విమానాలు భారీ ఇంజినీరింగ్‌ పరికరాలను మోసుకెళ్లాయి.     

ఇదీచదవండి.. ప్రతి శ్రీరామనవమికి అయోధ్యలో అద్భుతం

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)