Breaking News

పారా గ్లైడింగ్‌లో ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం

Published on Sun, 01/19/2025 - 11:53

పనాజీ: పారాగ్లైడింగ్ చేయాలని చాలామంది అనుకుంటారు. అయితే పారాగ్లైడింగ్ విషయంలో అప్పుడప్పడు ప్రమాదాలు చోటుచేసుకుంటుంటాయి. ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక్కోసారి పర్యాటకులు ప్రమాదాలు బారిన పడుతుంటారు.

తాజాగా ఉత్తర గోవాలో పారాగ్లైడింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదంలో పారాగ్లైడింగ్(Paragliding) చేస్తున్న మహిళా పర్యాటకురాలితో పాటు కోచ్‌ మృతిచెందాడు. ఈ ప్రమాద వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు. శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కేరి గ్రామంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు  పేర్కొన్నారు.

ఈ దుర్ఘటనలో పూణే నివాసి శివానీ డేబుల్ ఆమె శిక్షకుడు సుమన్ నేపాలీ (26) మృతిచెందారని, డేబుల్ పారాగ్లైడింగ్ కోసం బుకింగ్ చేసుకున్న 'అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ' చట్టవిరుద్ధంగా నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. పారాగ్లైడర్ టేకాఫ్ అయిన వెంటనే అది లోయలో పడిపోవడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ  ఉదంతంలో కంపెనీ యజమాని శేఖర్ రైజాదాపై మాండ్రేమ్ పోలీస్ స్టేషన్‌(Mandrem Police Station)లో కేసు నమోదైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

ఈ కేసులో కంపెనీతో పాటు దాని యజమానిపై నేరపూరిత హత్య కేసు నమోదు చేసినట్లు గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ తెలిపారు. పోలీసు అధికారి పరేష్ కాలే తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు శేఖర్ రైజాదా ఉద్దేశపూర్వకంగా పైలట్‌కు లైసెన్స్ లేకుండా పారాగ్లైడింగ్ నిర్వహించడానికి అనుమతించాడు. ఫలితంగా పర్యాటకురాలు ప్రాణాలు  కోల్పోయింది.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై చర్యలు చేపట్టారు.

ఇది కూడా చదవండి: Uttar Pradesh: ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవ దహనం

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)