కునోలో మరో చీతా మృతి.. ఐదు నెలల్లోనే తొమ్మిది..

Published on Wed, 08/02/2023 - 15:34

భోపాల్‌: 'ప్రాజెక్టు చీతా'లో భాగంగా తీసుకువచ్చిన చీతాల మరణాలు ఆగడం లేదు. తాజాగా మరో ఆడ చీతా ప్రాణాలు విడిచింది. ఐదు నెలల్లోనే తొమ్మిది చీతాలు మరణించడం గమనార్హం. తాజాగా మరణించిన చీతాను 'దాత్రి'గా గుర్తించారు. దీని మరణానికి గల కారణాలు ఇప్పటికీ తెలియలేదు. పోస్టుమార్టం తర్వాత వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. 

కునో నేషనల్ పార్కులోని బోమాస్ ఎన్‌క్లోజర్‌లో ఏడు మగ, ఆరు ఆడ, ఓ ఆడ చితాపిల్లతో కలిపి మొత్తం 14 చీతాలను సంరక్షిస్తున్నారు. వీటి బాధ్యతల కోసం పార్కు జంతు సంరక్షకులతో సహా ఓ నమీబియాకు చెందిన నిపుణుడు కూడా ఉన్నారు. ఈ చీతాల్లో రెండింటిని ఇటీవల బయటకు వదిలారు. ఇందులో ఓ చితా చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. 

కునో నేషనల్ పార్కులో మూడు చీతా పిల్లలతో కలిపి మొత్తం ఐదు నెలల్లోనే తొమ్మది చీతాలు మరణించాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రాజెక్టు చీతాలో భాగంగా 20 చీతాలను నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చారు. అప్పటి నుంచి వాటికి నాలుగు పిల్లలు కూడా జన్మించాయి. తీసుకువచ్చిన చీతాల్లో ఒక్కొక్కటిగా మరణించడం.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన చీతాల సంరక్షణ కార్యక్రమానికి పెద్ద ఎదురు దెబ్బేనని చెప్పవచ్చు. 

చీతాలను గుర్తించడానికి వాటకి రేడియా కాలర్‌ను తగిలించారు. వాటి కారణంగానే చీతాలు అనారోగ్యం బారిన పడుతున్నాయని అధికారులు గుర్తించారు. చివరికి వాటిని తొలగించాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి: ఎన్సీఆర్‌కు పాకిన హర్యానా మత ఘర్షణలు.. 116 మంది అరెస్ట్‌.. ఢిల్లీ హై అలర్ట్‌

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)