Delhi High Court: సంక్షేమం కాదు.. సంఘర్షణ

Published on Sat, 10/05/2024 - 10:26

జనావాసాల మధ్య సంచరించే వానరాలకు ఆహారం అందుబాటులో ఉంచడం జంతు సంక్షేమం కిందికి రాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇది ఒక రకంగా మనుషులతో వాటి సంఘర్షణకు దారి తీస్తోందని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మన్మోహన్, జస్టిస్‌ తుషార్‌ రావు గేదెల ధర్మాసనం సెప్టెంబర్‌ 30వ తేదీన వెలువరించిన తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది. 

అడవుల్లో చెట్లపై సంచరిస్తూ కాయలు, పండ్లు లాంటివి తినే వానరాలు సహజ ఆవాసాలను వదిలి జనాల మధ్యకు, వీధుల్లోకి రావడానికి కారణం మనమేనని పేర్కొంది. బ్రెడ్, చపాతీ, అరటి పండ్లులాంటివి ఇస్తూ వాటికి హానిని, ప్రజలతో ఘర్షణ పడే స్థితికి వాటిని తీసుకొస్తున్నామని వ్యాఖ్యానించింది. ‘పబ్లిక్‌ పార్కులు, హోటళ్లు, క్యాంటీన్లలో పోగయ్యే చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తుండటంతో కోతులు అక్కడ పోగవుతున్నాయి.

 కోతులకు ఆహారం ఇవ్వడం వల్ల అవి మనుషులపై ఆధారపడటాన్ని పెంచుతుంది. ఆహారం దొరకని సందర్భాల్లో అవి హాని కలిగిస్తాయి. ఈ పరిణామం మనుషులతో జంతు సంఘర్షణకు దారి తీస్తుంది. పౌర సంస్థలు దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. సురక్షితంగా ఉండాలనుకునే వారు ఆహార వ్యర్థాలను ఎక్కడిపడితే అక్కడ పడేయడం మానుకోవాలి’అని హితవు పలికింది. 
 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)