గాలిపటాలతో డ్రోన్‌లను నిర్వీర్యం చేస్తున్న రైతులు!

Published on Wed, 02/14/2024 - 13:20

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న కిసాన్ ఆందోళన్ 2.0కు బుధవారం రెండవ రోజు. ప్రస్తుతం హర్యానాలోని అంబాలాలోగల శంభు సరిహద్దు దగ్గర రైతులు కాపుగాశారు. గత 36 గంటలుగా  రైతులు ఇక్కడి నుంచే తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. మరోవైపు పోలీసులు నిరంతరం రైతులపై టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగిస్తున్నారు. 

రైతులు తమ ఆందోళనల్లో భాగంగా ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసుల డ్రోన్‌లకు ఆటంకం కలిగించేందుకు గాలిపటాలను ఎగురవేయడం ప్రారంభించారు. ఇందుకోసం రైతులు లెక్కలేనన్ని గాలిపటాలను తీసుకువచ్చి, ఎగురవేయడం ప్రారంభించారు. దీంతో ఆ డ్రోన్‌లు గాలిపటాల దారాలకు చిక్కుకుని కింద పడిపోతున్నాయి. కాగా శంభు సరిహద్దులో పంజాబ్ నుంచి వస్తున్న రైతులపై హర్యానా పోలీసులు నిరంతరం నిఘా సారిస్తున్నారు. 

ఆందోళనలకు కొనసాగిస్తున్న రైతులు డ్రోన్లపై రాళ్లు రువ్వే ‍ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ రాళ్లు డ్రోన్‌లను తాకలేకపోతున్నాయి.  మరోవైపు హర్యానాలోని జింద్‌లోని చక్కెర మిల్లును తాత్కాలిక జైలుగా మార్చారు. ఇక్కడ ఒక వైద్యుడు, ఫార్మాసిస్టును నియమించారు. అలాగే గాయపడిన  రైతులకు ఇక్కడే చికిత్స అందిస్తున్నారు. ఈ చక్కెర కర్మాగారం జింద్-పాటియాలా-ఢిల్లీ రహదారిలోని ఝంజ్ గ్రామానికి సమీపంలో ఉంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)