Breaking News

దేశంలోని ఐదు ప్రముఖ కాళీమాత మందిరాలు

Published on Mon, 10/07/2024 - 09:55

కోల్‌కతా: దేశంలో దేవీ నవరాత్రుల వైభవం కొనసాగుతోంది. ఈ నవరాత్రులలో ఏడవ రోజున కాళికాదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దుర్గాదేవి రూపం మహిళా సాధికారతకు చిహ్నంగా పరిగణిస్తారు. కాళికా రూపాన్ని పూజించడం ద్వారా శత్రుబాధ నివారణ అవుతుందని, దుఃఖాలు నశించిపోతాయని చెబుతుంటారు.

దేశంలో పలు కాళీమాత ఆలయాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆసక్తికర చరిత్రలు ఉన్నాయి.  వీటిలో ఐదు దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కాలిబడి(ఆగ్రా)
ఆగ్రాలోని కాలిబడి కాళికా ఆలయం సుమారు 200 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ ఉన్న అద్భుత ఘాట్‌లోని నీరు ఎప్పటికీ  ఎండిపోదని, అందులో క్రిమికీటకాలు పెరగవని స్థానికులు చెబుతుంటారు.

జై మా శ్యామసుందరి(కోల్‌కతా)
మరో కాళీ దేవాలయం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉంది. దాని పేరు జై మా శ్యామసుందరి కాళీ మందిరం. ఈ ఆలయంలో కాళీదేవి  సంచరిస్తుందని స్థానికులు చెబుతుంటారు. ప్రతీరోజూ ఉదయం ఆలయ తలుపు తెరిచినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయని అంటారు.

కాళీఘాట్‌(పశ్చిమ బెంగాల్‌)
మూడవ కాళీ దేవాలయం కూడా పశ్చిమ బెంగాల్‌లో ఉంది. కాళీఘాట్‌లోని ఈ కాళీ దేవాలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయంలో కాళీదేవి నాలుక బంగారంతో తయారు చేశారు.

కాళీ ఖో(ఉత్తరప్రదేశ్‌)
నాల్గవ ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో వింధ్య పర్వతంపై కాళీ ఖో పేరిట ఉంది. ఈ ఆలయం ధ్యాన సాధనకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారికి సమర్పించే ప్రసాదం మాయమవుతుండటం వెనక కారణం ఏమిటో నేటికీ వెల్లడి కాలేదని భక్తులు చెబుతుంటారు.

మాతా బసయ్య(మొరెనా) 
ఐదవది ఉత్తరప్రదేశ్‌లోని మొరెనాలో ఉన్న మాతా బసయ్య ఆలయం. ఈ ఆలయం సుమారు 200 సంవత్సరాల క్రితం నాటిది. నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ద్వారా భక్తుల తాము కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. 

ఇది కూడా చదవండి: కైలాస్‌నాథ్‌... చరణాద్రి శిఖరం

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)