Breaking News

Year Ender 2024: కుటుంబం మెచ్చిన 10 అందమైన ప్రదేశాలు

Published on Mon, 12/23/2024 - 07:35

2024 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. నూతన సంవత్సరాన్ని స్వాగతించేందుకు అందరం సిద్ధమవుతున్నాం. ఈ నేపధ్యంలో 2024 ఎలా గడిచిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. 2024 భారతదేశంలోని పలు కుటుంబాలకు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతులను అందించింది.

దేశవ్యాప్తంగా చాలామంది సెలవు రోజుల్లో తమ కుటుంబాలతో సహా పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. యువత సాహసభరితమైన ప్రయాణాలు సాగించగా, వయసుపైబడినవారు ప్రశాంత వాతావరణాలకు చేరుకుని సేదతీరారు. అందమైన బీచ్‌లు, అద్భుతమైన పర్వతప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలలో ప్రయాణించేందుకు భారతీయులు మక్కువ చూపారు. వాటిలో 10 ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  

గోవా
2024లో టాప్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ టూరిస్ట్ డెస్టినేషన్‌గా గోవా ప్రత్యేక స్థానం దక్కించుకుంది. గోవాలోని అందమైన బీచ్‌లు, చర్చిలు ఉన్నాయి. ఇక్కడి సంస్కృతి  ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుందిత. కుటుంబ సభ్యులతో సహా ఎంజాయ్‌చేసేందుకు గోవా అత్యుత్తమ ప్రదేశం.  వినోద కార్యక్రమాలను ఆస్వాదించేందుకు, చారిత్రక కోటలను సందర్శించేందుకు, అత్యుత్తమ షాపింగ్‌కు గోవా పెట్టిందిపేరు.

కేరళ
ఒకవైపు సహజ సౌందర్యం, మరోవైపు ఘనమైన సంస్కృతికి కేరళ పెట్టిందిపేరు. ఇక్కడి ఆహారం ఆహారప్రియుల నోరూరింపజేస్తుందని చెబుతారు. కుటుంబంతో సహా చూడాల్సిన ప్రాంతాలెన్నో కేరళలో ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ వాటర్స్, తేయాకు తోటలు ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇక్కడ జరిగే పండుగలు, ఉత్సవాలు ఉత్సాహాన్ని  రెండింతలు చేస్తాయి.

కశ్మీర్‌
కశ్మీర్.. ప్రకృతి అందాలకు నెలవు. కుటుంబ సభ్యులతో సహా సందర్శించేందుకు ఉత్తమ ప్రదేశం. గుల్‌మార్గ్‌లో స్కీయింగ్, స్నోబోర్డింగ్, బుల్ కార్ రైడ్‌లను ఆస్వాదించవచ్చు.  శ్రీనగర్‌లోని అందమైన లోయలను, సరస్సులను సందర్శించవచ్చు.

ముస్సోరీ
ఉత్తరాఖండ్‌లోని అందమైన హిల్ స్టేషన్ ముస్సోరీ. కుటుంబసభ్యులతో సహా ఆనందంగా విహరించేందుకు అత్యుత్తమ ప్రదేశం ఇది. ఇక్కడ ట్రెక్కింగ్‌ చేయవచ్చు. కేబుల్ కార్ రైడ్‌ని  ఎంజాయ్‌ చేయవచ్చు. స్థానిక మార్కెట్‌లను సందర్శించవచ్చు.

సిక్కిం
భారతదేశంలోని ఈశాన్య ప్రాంతమైన సిక్కిం సహజ సౌందర్యానికి నిలయంగా పేరొందింది. ఇక్కడి పురాతన మఠాలు దేశ ఘన చరిత్రను చాటిచెబుతాయి. ఇక్కడికి కుటుంబంతో సహా వచ్చే పర్యాటకులు వివిధ
సాహస కార్యకలాపాల్లో పాల్గొని ఆనందించవచ్చు.

మనాలి 
హిమాచల్ ప్రదేశ్‌లోని ఈ ప్రసిద్ధ హిల్ స్టేషన్ సాహసాలు చేసేవారికి, ప్రకృతిని ఇష్టపడేవారికి అత్యుత్తమ ఎంపిక. ఇక్కడ స్కీయింగ్, స్నోబోర్డింగ్,ట్రెక్కింగ్ మొదలైనవి కుటుంబ సభ్యులకు అమితమైన ఆనందాన్ని అందిస్తాయి. స్థానిక మార్కెట్‌లు మంచి షాపింగ్‌ అనుభూతులను అందిస్తాయి.  

డార్జిలింగ్
పశ్చిమ బెంగాల్‌లోని ఈ అందమైన హిల్ స్టేషన్ కుటుంబంతో సహా ఎంజాయ్‌ చేసేందుకు అనువైన ప్రదేశం. ఇక్కడి టాయ్ ట్రైన్ రైడ్ ఎంతో వినోదాన్నిస్తుంది. ఇక్కడి టీ తోటలు ఎవరినైనా సరే వావ్‌ అనిపించేలా చేస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తే ఆ అనుభూతి జీవితాంతం గుర్తుంటుంది.

గుల్మార్గ్ 
‍కశ్మీర్‌లోని ఈ అందమైన హిల్ స్టేషన్ స్కీయింగ్, స్నోబోర్డింగ్ ఇష్టపడేవారికి ఎంతో అనువైనది. కేబుల్ కార్ రైడ్‌లు, స్నో గేమ్‌లతో వినోదించవచ్చు. స్నోమెన్‌లను తయారు చేసి ఆనందించవచ్చు.

జైసల్మేర్
రాజస్థాన్‌లోని ఈ అందమైన ఎడారి నగరం.. కుటుంబ సభ్యులంతా కలసి సందర్శించినప్పుడు వారి ఆనందం రెట్టింపవుతుంది. ఒంటె రైడ్, ఎడారి సఫారీ, ఇక్కడి కోటలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఢిల్లీ 
దేశ రాజధాని ఢిల్లీ కుటుంబంతో సహా  చూడాల్సిన అత్యుత్తు ప్రదేశం. ఈ ప్రాంత చరిత్ర, సంస్కృతి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇక్కడి వంటకాలు అందరికీ నోరూరేలా చేస్తాయి. స్థానిక స్మారక చిహ్నాలు, మ్యూజియంలు, మార్కెట్‌లను కుటుంబ సభ్యులంతా కలసి చూసినప్పుడు వారి ఆనందం రెట్టింపవుతుంది. ఢిల్లీలో పలు థీమ్‌ పార్కులున్నాయి. ఇవి అత్యుత్తమ వినోదాన్ని పంచుతాయి.

ఇది కూడా చదవండి: Year Ender 2024: వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు.. చాటింగ్‌ స్టైలే మారిపోయిందే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)