Breaking News

రిజిస్ట్రార్‌ జనరల్‌ నుంచే నేరుగా తాజా జాబితా

Published on Fri, 05/02/2025 - 02:14

న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు పాత పేర్ల తొలగింపు, సవరణలతో అత్యంత కచ్చితత్వంతో ఆధునీకరించిన ఓటర్ల జాబితాను సిద్ధంచే సేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మృతిచెందిన ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి వెనువెంటనే తొలగించాలని నిర్ణయించింది. ఎవరైనా ఓటర్‌ మృతిచెందితే అధికారికంగా తమకు సమాచారం వచ్చేదాకా వేచిచూడకుండా నేరుగా ‘రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా’నుంచి మరణాల తాజా జాబితాను తెప్పించుకుని ప్రస్తుత ఓటర్ల జాబితాతో సరిపోల్చి మృతుల పేర్లను తొలగించనుంది. దీంతో మృతుల పేరిట మరొకరు ఓటు వేసే ఆస్కారం లేకుండా చేయాలని ఎలక్షన్‌ కమిషన్‌ భావిస్తోంది. దీంతోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలను ఈసీ తీసుకుంది. అవి.. 

1. నమోదిత మరణాల తాజా జాబితా రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అందగానే బూత్‌ స్థాయి అధికారి(బీఎల్‌ఓ)కి సమాచారం ఇస్తారు. ఫామ్‌–7 అభ్యర్థన కోసం వేచిచూడకుండా నేరుగా రిజిస్ట్రార్‌ జనరల్‌ నుంచి ఈ జాబితా తెప్పించుకోవచ్చు. తర్వాత మరణాన్ని ధృవీకరించుకునేందుకు ఆ బీఎల్‌ఓ సదరు ప్రాంతానికి వెళ్లి మృతి విషయాన్ని ఖరారుచేసుకుంటారు. ఓటర్ల నమోదు నియమావళి–1960లోని 9వ నిబంధన, 2023లో సవరించిన జనన, మరణాల నమోదు చట్టం–1969లోని 3(5)(బీ) సెక్షన్‌ ప్రకారం ఆయా జనన, మరణాల వివరాలు అడిగి తీసుకునే హక్కు ఈసీకి ఉంది.  

2. ఓటర్‌ ఇన్ఫర్మేషన్‌ స్లిప్‌(వీఐఎస్‌) మరింత స్పష్టంగా ఉండేందుకు ప్రస్తుతమున్న దాని డిజైన్‌ను మార్చనున్నారు. ఇకపై పెద్ద అక్షరాలతో డిజైన్‌ చేయడం వల్ల వీఐఎస్‌ సీరియల్‌ నంబర్, ఓటర్‌ పార్ట్‌నంబర్‌ మరింత స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో తమ పోలింగ్‌ స్టేషన్‌ ఎక్కడుందో ఓటర్‌ మరింత తేలిగ్గా చూసుకోగలడు. పోలింగ్‌ అధికారులు సైతం ఆయా ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితాలో ఏ పేజీలో ఉన్నాయో సులభంగా గుర్తుపట్టగలరు. 
 


3. ప్రజా ప్రతినిధుల చట్టం,1950లోని 13బీ(2) సెక్షన్‌ ప్రకారం ఎలక్టోరల్‌ రిజి్రస్టేషన్‌ ఆఫీసర్‌ నియమించిన బీఎల్‌ఓలు అందరికీ ప్రామాణికమైన ఫొటో గుర్తింపు కార్డులను జారీచేయనున్నారు. ఓటర్‌ వెరిఫికేషన్, నమోదు కార్యక్రమాల్లో బీఎల్‌ఓలను ఓటర్లు సులభంగా గుర్తించడానికి, వారితో ఎలాంటి నిర్మొహమాటం లేకుండా సందేహాలు నివృత్తిచేసుకోవడానికి, అభ్యంతరాలు వ్యక్తంచేయడానికి వీలు చిక్కుతుంది. ముఖ్యంగా బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరిగే క్రమంలో వారిని ఓటర్లు తేలిగ్గా గుర్తుపట్టడానికి ఈ నూతన ప్రామాణిక గుర్తింపు కార్డు తప్పనిసరి అని ఈసీ భావిస్తోంది.   

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)