బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి

Published on Thu, 10/03/2024 - 08:58

బరేలీ: యూపీలోని బరేలీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అక్రమంగా నిర్వహిస్తున్న బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి, ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. మరో ఇద్దరు చిన్నారుల జాడ తెలియడం లేదు. వారిని వెదికేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

రెండు గంటల వ్యవధిలో బాణసంచా ఫ్యాక్టరీలో ఒకదాని తర్వాత ఒకటిగా భారీ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల తీవ్రతకు గ్రామమంతా దద్దరిల్లింది. సిరౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్‌పూర్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పేలుడు ధాటికి సమీపంలోని పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం సంఘటనాస్థలికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఐదుగురిని రక్షించారు. ఈ ఘటన నేపధ్యంలో ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు సహా నలుగురు పోలీసులను సస్పెండ్‌ చేశారు.

పేలుడు ఘటన గురించి తెలుసుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బరేలీ రేంజ్) రాకేశ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఫ్యాక్టరీ నిర్వాహకుడిని నాసిర్‌గా గుర్తించామన్నారు. అతనికిగల లైసెన్సు వివరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం నాసిర్‌కు భారీగా  దీపావళి ఆర్డర్లు వచ్చాయని, దీంతో పగలు, రాత్రి టపాసుల తయారీ పని జరుగుతోందని, చాలా మంది కూలీలు పనిచేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. అయితే ఇక్కడ ఎటువంటి భద్రత ఏర్పాట్లు లేవని వారు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: భారత్‌ అప్రమత్తంగా ఉండాలి: జీటీఆర్‌ఐ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)