SBI బ్యాంక్‌ మేనేజర్‌ చెంప చెళ్లుమనిపించిన మాజీ కేంద్రమంత్రి కుమార్తె

Published on Sun, 07/26/2026 - 07:07

సాక్షి,చెన్నై: మాజీ కేంద్ర మంత్రి కుమార్తె విచక్షణ కోల్పోయారు. విధుల్లో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌పై చేయిచేసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివరాల్లోకి వెళితే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్‌పై దాడి చేసిన ఆరోపణలపై మాజీ కేంద్ర మంత్రి ఎంకే అళగిరి కుమార్తె కయల్విళి అళగిరిపై చెన్నై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. చెన్నైలోని అడయార్ ప్రాంతంలో ఉన్న ఎస్‌బీఐ ఎన్‌ఆర్‌ఐ బ్రాంచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. అడయార్‌లోని ఎస్‌బీఐ బ్రాంచ్ నడుస్తున్న కమర్షియల్ భవనానికి కయల్విళి యజమాని. ఆ బిల్డింగ్‌లోని లిఫ్ట్ చాలా రోజులుగా పనిచేయకపోవడంతో, దానిని బాగు చేయాల్సిందిగా బ్యాంక్ మేనేజర్ హర్షీన్ సింగ్ నేరుగా కయల్విళికి ఫోన్ చేసి కోరారు. ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జూలై 20న ఆమె నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కు వచ్చారు.

బ్యాంకులో మేనేజర్‌తో కయల్విళి వాగ్వాదానికి దిగారు. మాటల మధ్యలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె అకస్మాత్తుగా లేచి మేనేజర్ చెంప చెల్లుమనిపించారు. ఈ దృశ్యాలన్నీ బ్యాంకులోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారడంతో తీవ్ర వివాదాస్పదంగా మారింది.  

ఈ ఘటనపై ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ నమశ్శివాయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనేజర్‌ను దూషించడం, దాడి చేయడం, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై అడయార్ పోలీసులు కయల్విళిపై పలు సెక్షన్ల కింద కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

 

 

#

Tags : 1

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)