Breaking News

బీజేపీలోకి మాజీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్.. అక్కడ నుంచి బరిలోకి?

Published on Sun, 03/24/2024 - 14:40

సార్వత్రిక ఎన్నికలకు రోజులు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ 'ఆర్‌కేఎస్‌ భదౌరియా' (రిటైర్డ్) మార్చి 24న బీజేపీలోకి చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో బీజేపీలో చేరారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన బదౌరియా.. సిట్టింగ్ ఎంపీ జనరల్ వీకే సింగ్ స్థానంలో ఘజియాబాద్ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. పార్టీలో చేరిన తర్వాత ఆర్‌కేఎస్‌ భదౌరియా (రిటైర్డ్.) మాట్లాడుతూ.. తాను ఐఏఎఫ్‌లో నాలుగు దశాబ్దాలకు పైగా పనిచేశానని, దేశ నిర్మాణానికి మరోసారి సహకరించేందుకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

భారతీయ వైమానిక దళం(IAF)లో భదౌరియా సుదీర్ఘ సేవలందించారని బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే కొనియాడారు. రక్షణ దళాలలో క్రియాశీల పాత్ర పోషించిన తర్వాత రాజకీయ రంగంలో చురుకుగా పాల్గొంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా.. 543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకోగా, భారత జాతీయ కాంగ్రెస్ (INC) కేవలం 52 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 282 సీట్లు గెలుచుకోగా, INC కేవలం 44 సీట్లు మాత్రమే సాధించింది.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)