Breaking News

పంద్రాగస్టున ప్రతి ముస్లిం ఇంటిపై త్రివర్ణ పతాకం

Published on Wed, 08/14/2024 - 06:50

దేశంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని బీహారీపూర్ బరేలీలోని దారుల్ ఉలూమ్ షేన్ అలా హజ్రత్‌లో ఆల్ ఇండియా ముస్లిం జమాత్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షహబుద్దీన్ రిజ్వీ బరేల్వీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పంద్రాగస్టున ముస్లింలు తమ ఇళ్లు, దుకాణాలు, మదర్సాలు, దర్గాలు, పాఠశాలలు, కళాశాలలు, ఇస్లామిక్ సంస్థలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని విజ్ఞప్తి చేశారు.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సంతోషకరమైన సందర్భంగా ప్రతి భారతీయుడు, ముఖ్యంగా ముస్లింలు తమ ఇళ్లు, దుకాణాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరుతున్నామన్నారు. మదర్సాలు, విద్యాసంస్థలు స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకోవాలని, ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మౌలానా ముఫ్తీ షహబుద్దీన్ కోరారు.

స్వాతంత్య్ర పోరాటంలో హిందూ, ముస్లిం సంఘాలు సహకారం  మరువరానిదన్నారు. అన్ని వర్గాల త్యాగాల ఫలితంగానే  స్వాతంత్య్ర పోరాటం విజయవంతమైందన్నారు. పంద్రాగస్టున ప్రత్యేక తపాలా బిళ్లలను విడుదల చేయాలని, వివిధ కూడళ్లకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను పెట్టాలని ఆయన సూచించారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)