Breaking News

ఎంపీ మహువాపై లోక్‌సభ నిర్ణయం అదేనా..!

Published on Fri, 12/08/2023 - 07:28

న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో ఎంపీ మహువా మెయిత్రాపై  నివేదికను ఎథిక్స్‌కమిటీ ఇవాళ లోక్‌సభ ముందు ప్రవేశపెట్టనుంది. వినోద్‌కుమార్‌ సోంకర్‌ నేతృత్వంలోని ఎథిక్స్‌ కమిటీ మహువా మొయిత్రాను పార్లమెంట్‌ నుంచి బహిష్కరిస్తూ సిఫారసు చేసిన నివేదికను ఇప్పటికే ఆమోదించింది. 


మహువాపై ఎథిక్స్‌ కమిటీ నివేదికను లోక్‌సభ ముందు ప్రవేశపెట్టేందుకు శుక్రవారం(డిసెంబర్‌ 8) లిస్ట్‌ చేశారు.  ఎజెండాలో ఐటెమ్‌ నంబర్‌ ఏడుగా దీనిని చేర్చారు. నివేదికను సభ ఆమోదిస్తే మహువా తన ఎంపీ పదవిని కోల్పోతారు. ఈ నెల 4వ తేదీనే మహువాపై నివేదికను టేబుల్‌ చేసేందుకు లిస్ట్‌ చేసినప్పటికీ దానిని ప్రవేశపెట్టలేదు. 


అయితే మహువాపై నివేదికపై సభలో చర్చ జరగాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్నాయి. చర్చ లేకుండా చర్యలు తీసుకోవడం సరికాదని సూచిస్తున్నాయి. ఈ నివేదిక మ్యాచ్‌ ఫిక్సింగ్‌లా కనిపిస్తోందని ఆ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందాని ఆదేశాల మేరకే అదానీ  గ్రూపుపై ప్రశ్నలు వేశారని బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే లోక్‌సభ స్పీకర్‌కు మహువాపై ఫిర్యాదు చేశారు. అనంతరం స్పీకర్ ఈ వ్యవహరాన్ని ఎథిక్స్‌ కమిటీకి సిఫారసు చేశారు. ఎథిక్స్‌ కమిటీ ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి నివేదికను సిద్ధం చేసింది. ఈ విచారణలో భాగంగా ఎథిక్స్‌ కమిటీ ముందు మహువా హాజరయ్యారు. 

ఇదీచదవండి..2024లో ఇస్రో 10 కీలక ప్రయోగాలు


  
 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)