Breaking News

చెప్పులో పాముకాటుకు ఐటీ ఇంజినీరు బలి

Published on Mon, 09/01/2025 - 07:52

బెంగళూరు: మృత్యువు ఒక్కోసారి ఎలా కబళిస్తుందో ఎవరూ ఊహించలేరు. బెంగళూరులోని ఓ ఐటీ ఇంజినీరుకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అనూహ్యంగా పాము రూపంలో మృత్యువు కాటేసింది. చెప్పులో పాముందని తెలీక వాటిని వేసుకున్న అతను దాని కాటుకు బలయ్యాడు. ఈ సంఘటన బెంగళూరులో బన్నేరుఘట్టలోని రంగనాథ లేఔట్‌లో జరిగింది. వివరాలివీ.. మంజు ప్రకాష్‌ (41) శనివారం మధ్యాహ్నం తన చెప్పులను వేసుకుని బయటకెళ్లి వచ్చాడు. 

ఇంట్లోకి రాగానే మత్తుగా ఉందంటూ పడుకున్నాడు. సుమారు గంట తరువాత కుటుంబ సభ్యులు ఇంటి వాకిలి ముందు ప్రకాష్‌ చెప్పులో చనిపోయిన రక్తపింజర పాము పడి ఉండడాన్ని చూశారు. వెంటనే అనుమానంతో గదిలోకి వెళ్లి చూడగా ప్రకాష్‌ నోట నుంచి నురగలు కక్కుతూ స్పృహతప్పి ఉన్నాడు. ఓ పాదం నుంచి రక్తం కారడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. 

ఏడేళ్ల కిందట ప్రకాష్‌ కాలుకు తీవ్రగాయం కావడంతో అప్పటినుంచి ఆ కాలికి స్పర్శ తక్కువ అని, అందువల్లే పాము కరిచినా తెలుసుకోలేకపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక సంఘటన జరిగిన బన్నేరుఘట్ట అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంటుందని.. ఇక్కడ పాముల బెడద ఎక్కువని తెలుస్తోంది.  

 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)