Breaking News

బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోలు హతం

Published on Thu, 01/29/2026 - 16:22

ఛత్తీస్‌గఢ్‌: బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు హతమయ్యారు. మావోలు కదలికల సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా మావోలు తారసపడ్డారు. దీంతో బలగాలు, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు జరగటంతో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. ఘటనాస్థలంలో ఒక ఏకే 47, పిస్టల్, పేలుడు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. బీజాపూర్ జిల్లా దక్షిణ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

కాగా, ఈ నెల 22న(గురువారం) జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్‌ జిల్లా చోటానాగ్రా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కుంబాదీహ్‌ గ్రామ సమీపంలో గల చైబాస అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పతిరాం మాంఝీ అలియాస్‌ అనల్‌దా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయనపై రూ.కోటి రివార్డు ఉంది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఘటనలో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలతోపాటు నిత్యావసర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో అనల్‌దా మృతిచెందినట్టు కొల్హాన్‌ డివిజన్‌ డీఐజీ అనురంజన్‌ కిస్పొట్టా ధ్రువీకరించారు. జార్ఖండ్‌లోని పిట్రాండ్‌కు చెందిన అనల్‌దా 1987 నుంచి క్రియాశీలకంగా ఉన్నారు.

ఆపరేషన్‌ కగార్‌ మొదలైన తర్వాత మావోయిస్టులకు దండకారణ్యంలో ఉన్న సేఫ్‌ జోన్లు క్రమంగా ప్రమాదంలో పడ్డాయి. దీంతో ఒకప్పటి పీపుల్స్‌వార్‌కు చెందిన మావోయిస్టుల్లో ఎక్కువ మంది ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలకు చేరుకోగా, మావోయిస్టు పార్టీలో విలీనమైన ఎంసీసీ (మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌)కి సంబంధించిన కీలక నేతలు ఒడిశా–జార్ఖండ్‌ సరిహద్దులో విస్తరించిన శరందా అడవులను షెల్డర్‌ జోన్‌గా మార్చుకున్నారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)