Breaking News

భారీ ఎన్‌కౌంటర్‌.. మావోయిస్ట్‌ కీలక నేత చలపతి మృతి

Published on Tue, 01/21/2025 - 09:32

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీకి మరో భారీ దెబ్బ తగిలింది. ఎదురుకాల్పుల్లో 19 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా భద్రతా బలగాలు జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. కోబ్రా బెటాలియన్‌, సీఆర్‌పీఫ్‌ సిబ్బంది కూంబింగ్‌లో  పాల్గొన్నారు. కుటరిఘాట్‌ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం.

ఈ ఎదురు కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు జైరామ్ అలియాస్ చలపతి మృతి చెందారు. చలపతిపై రూ.కోటి రివార్డ్ ఉంది. ఘటనా స్థలం నుంచి ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్‌తో పాటు భారీ ఎత్తున ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఈ నెల 19 నుంచి రెండు రాష్ట్రాల బలగాల ఉమ్మడి ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.

భారీగా మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో సెర్చ్‌ ఆపరేషన్‌  నిర్వహించారు. రెండు రోజులుగా ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. నిన్న, ఇవాళ ఎదురు కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతిచెందారు.

కాగా, తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌లో గత గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరో ఘటనలో బిజాపూర్‌ జిల్లా బాసగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో కోబ్రా బెటాలియన్‌ కానిస్టేబుళ్లు మృదుల్‌ బర్మన్, మహ్మద్‌ ఇషాఖ్‌ గాయపడ్డారు.

తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం(కే) మండల సరిహద్దులోని మారేడుబాక –ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్‌ జిల్లా ఊసూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పూజారి కాంకేర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరం ఉన్నట్టు సమాచారం అందుకున్న బలగాలు కూంబింగ్‌ ప్రారంభించాయి. మొత్తం రెండు వేల మంది జవాన్లు అడవులను జల్లెడ పట్టడం మొదలెట్టారు.

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్

ఇదీ చదవండి: బాయ్‌ఫ్రెండ్‌‌ను చంపిన గ్రీష్మకు ఉరిశిక్ష.. కోర్టు సంచలన తీర్పు!

 

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)