Breaking News

ఈ వేసవిలో 10 శాతం పెరగనున్న... విద్యుత్‌ డిమాండ్‌!

Published on Wed, 04/09/2025 - 06:03

న్యూఢిల్లీ: ప్రపంచమంతటా విద్యుత్‌ డిమాండ్‌ ఏయేటికాయేడు విపరీతంగా పెరిగిపోతోంది. ఈ వేసవిలో భారత్‌లో విద్యుత్‌ డిమాండ్‌ 9 నుంచి 10 శాతం పెరగనుందని గ్లోబల్‌ ఎనర్జీ థింక్‌ ట్యాంక్‌ ‘ఎంబర్‌ గ్లోబల్‌ ఎలక్ట్రిసిటీ రివ్యూ’అంచనా వేసింది. ‘‘ఏప్రిల్‌ నుంచి జూన్‌ దాకా దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. వడగాల్పుల రోజులు కూడా పెరుగుతాయి. 

అందుకే విద్యుత్‌ డిమాండ్‌ బాగాపెరగనుంది’’అని మంగళవారం విడుదల చేసిన కొత్త నివేదికలో వెల్లడించింది. వచ్చే దశాబ్ద కాలంలో దేశంలో ఎయిర్‌ కండిషన్ల సంఖ్య మరో 15 కోట్ల దాకా పెరుగుతుందని పేర్కొంది. దాంతో 2035 నాటికి పీక్‌ అవర్‌ విద్యుత్‌ డిమాండ్‌ ఏకంగా 180 గిగావాట్లకు పెరిగి విద్యుత్‌ గ్రిడ్‌పై తీవ్ర భారం పడుతుందని తెలిపింది. 

2024లో ప్రపంచవ్యాప్తంగా..  
2024లో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ ఏడాది ప్రపంచ విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుదలలో ఐదో వంతుకు వడగాలులే కారణం. దాంతో ప్రపంచ విద్యుత్‌ రంగ ఉద్గారాలు 2024లో 1.6 శాతం పెరిగాయి. 22.3 కోట్ల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదలైంది. దాంతో మొత్తం ఉద్గారాలు రికార్డు స్థాయిలో 1,460 కోట్ల టన్నులకు పెరిగాయి.

భారత్‌లో...  
2024 ఏప్రిల్‌–జూన్‌ మధ్య మన దేశంలో విద్యుత్‌ డిమాండ్‌ 10.4 శాతం పెరిగింది. మొత్తం విద్యుత్‌ వాడకంలో ఎయిర్‌ కండిషనర్ల వాటాయే 30 శాతం! 2024 మే 30న జాతీయ స్థాయిలో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 250 గిగావాట్లు దాటింది. ఇది అంచనాల కంటే 6.3 శాతం ఎక్కువ! 2024లో దేశంలో వడగాల్పుల తరచుదనం, తీవ్రత పెరిగాయి. జాతీయ గృహ విద్యుత్‌ వినియోగం వాటా 2012–13లో 22 శాతం కాగా 2022–23 నాటికి 25 శాతానికి పెరిగింది. ఆర్థిక వృద్ధి, పెరిగిన వేడి వంటివి శీతలీకరణకు డిమాండ్‌ పెరగడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో చైనా, నైజీరియా, ఇండొనేíÙయా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, అమెరికా తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)