Breaking News

ముగిసిన లోక్‌సభ 2024 ఎన్నికల ప్రచారం

Published on Thu, 05/30/2024 - 18:25

న్యూఢిల్లీ, సాక్షి: సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన ఏడో విడత లోక్ సభ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ఎనిమిది రాష్ట్రాల్లో మైకులు మూగబోయాయి. చివరి విడతలో 57 లోక్ సభ నియోజకవర్గాల్లో జూన్ 1న పోలింగ్ జరగనుంది. 

బీహార్ లో ఎనిమిది లోక్‌సభ స్థానాలకు 134 మంది అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. చండీగఢ్ 1 లోక్ సభ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ నాలుగు లోక్‌సభ స్థానాలకు 37 మంది పోటీ పడుతున్నారు. జార్ఖండ్ 3 లోక్‌సభ స్థానాల్లో 52 మంది, ఒడిశాలో 6 లోక్‌సభ స్థానాలకు 66 మంది,  పంజాబ్ 13 లోక్‌సభ స్థానాలకు 328 మంది, ఉత్తర ప్రదేశ్ 13 లోక్‌సభ స్థానాల్లో 144 మంది బరిలో నిలిచారు. వెస్ట్ బెంగాల్ 9 స్థానాలకు ,124 మంది బరిలో ఉన్నారు. 

చివరి విడతలో పలు కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. వారణాసి నుంచి ప్రధాని మోదీ, మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్, హామిపూర్ నుంచి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, గోరక్‌పూర్ నుంచి నటుడు రవికిషన్, డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్నారు.

18వ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ మొత్తం ఏడు దశల్లో 44 రోజులపాటు సాగనుంది. 1951-52లో తొలి పార్లమెంటు ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం సాగనున్న ఎన్నికలు ఇవే.

ముగిసిన లోక్ సభ ఎన్నికల ప్రచారం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)