Breaking News

ఈ ఎన్నికల్లో బిర్యానీ రూ.150 అంతే.. కాస్ట్‌లీ అంటే కుదరదు!

Published on Sat, 03/23/2024 - 17:11

లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడానికి వీల్లేదు. వారు ఖర్చు చేసే ప్రతి పైసాకు ఎన్నికల కమిషన్‌కు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. ప్రచార సమయంలో తమ మద్దతుదారులకు ఇప్పించే ఛాయ్‌, సమోసాలకు ఖర్చుపెట్టిన డబ్బుకు కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఖర్చులపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక బృందాలను ఎలక్షన్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపయోగించే 200కు పైగా వస్తువుల సవరించిన ధరల జాబితాను ఇటీవలి నోటిఫికేషన్‌లో ఎలక్షన్‌ కమిషన్‌ పేర్కొంది. అభ్యర్థులు ఖర్చు పరిమితిని మించకుండా చూసుకోవడానికి వీటిని ఎన్నికల ప్రకటిచింది. ఈసీకి సమర్పించే ఖర్చుల వివరాల్లో ఆయా వస్తువులు, ఆహార పదార్థాలకు ఎన్నికల కమిషన్‌ నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువగా చూపించేందుకు వీలుండదు.

పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖర్చు పరిమితిని ఎలక్షన్‌ కమిషన్‌ ఈ సారి రూ.95 లక్షలకు పెంచింది. ఇది  2019 ఎన్నికల సమయంలో రూ. 70 లక్షలు ఉండేది. ఇందుకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వినియోగించే వస్తువులు, సేవల ధరలను కూడా ఈసీ స్వల్పంగా పెంచింది. ధరల జాబితాను ఉపయోగించి అభ్యర్థులు చేసే ఖర్చులను జిల్లా ఎన్నికల అధికారి మూల్యాంకనం చేస్తారు.

చెన్నై జిల్లా ఎన్నికల అధికారి జె.రాధాకృష్ణన్ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. టీ ధరను రూ.10 నుంచి రూ.15కి, కాఫీ ధరను రూ.15 నుంచి రూ.20కి పెంచారు. అయితే చికెన్ బిర్యానీ ప్యాకెట్‌ ధరను మాత్రం రూ. 2019తో పోలిస్తే రూ.180 నుంచి రూ.150కు తగ్గించారు. మరోవైపు మటన్ బిర్యానీ ప్యాకెట్‌ ధరలో మార్పు లేదు. అది రూ. 200గా ఉంది. టీషర్టులు, చీరల ధరలు కూడా పెంచలేదు.

ప్రచారానికి సంబంధించిన కార్యకలాపాలలో పాల్గొనే వారికి అందించే ఆహారం, వాహనాలు, ప్రచార కార్యాలయాలు, సమావేశాల కోసం అద్దెకు తీసుకున్న ఇతర ఫర్నిచర్, వేదిక అలంకరణ ఖర్చులు, కూలీల ఖర్చులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యానర్లు, పోస్టర్లు, కుర్చీలు వంటి వస్తువులతో సహా అనేక అంశాలు ఈ జాబితాలో ఉన్నాయి. జెండాలు, బాణాసంచా, పోస్టర్లు, దండలు, సాంస్కృతిక నృత్యాలతో సహా రాజకీయ నేతలకు స్వాగతం పలికేందుకు అయ్యే ఖర్చులు కూడా అభ్యర్థి ఖర్చుల్లోనే చేరుస్తారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)