Breaking News

కూర్చుని తింటేనే మేలు

Published on Mon, 06/01/2026 - 01:36

ఎంత బిజీగా ఉన్నా సరే.. తినడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాల సమయం కేటాయించటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నేటి ఆధునిక కాలంలో చాలామంది నడుస్తూ లేదా డ్రైవ్‌ చేస్తూ లేదా ప్రయాణిస్తూ త్వరత్వరగా తినేస్తుంటారు. దీనినే ఈటింగ్‌ ఆన్‌ ది గో (కదులుతూ తినడం) అంటారు. ఇలా హడావుడిగా తినడం వల్ల శరీరానికి ఏ విధంగా ఇబ్బంది కలుగుతుందో వైద్య నిపుణులు చెబుతున్నారు.  

జీర్ణక్రియ మందగిస్తుంది
నడుస్తూ తినేటప్పుడు ఆహారాన్ని సరిగ్గా నమలడం కుదరదు. దీనివల్ల ఆహారం పెద్ద పరిమాణంలో నేరుగా కడుపులోకి వెళుతుంది. దీంతో నడుస్తున్నప్పుడు రక్తం జీర్ణవ్యవస్థ వైపు కాకుండా కాళ్లు, చేతుల కండరాల వైపు ప్రవహిస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగించి కడుపు ఉబ్బరం, అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.

తెలియకుండానే అతిగా తినేస్తాం 
ప్రయాణాల్లో లేదా వేరే పనుల్లో ఉంటూ తినడం వల్ల మెదడు ఆహారంపై దృష్టి పెట్టదు. కడుపు నిండిందనే సంకేతాన్ని మెదడు సకాలంలో అందుకోలేదు. దీంతో మనకు తెలియకుండానే అవసరానికి మించి ఎక్కువ క్యాలరీలు లాగించేస్తాం.

ఊబకాయం.. బరువు పెరగడం  
త్వరత్వరగా నడుస్తూ తినే అలవాటు ఉన్నవారిలో ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ. శరీరం ఆహారంలోని పోషకాలను సరిగ్గా గ్రహించకుండా, వాటిని నేరుగా కొవ్వుగా మార్చే ప్రమాదముంది.  

గ్యాస్‌ సమస్యలు (బ్లోటింగ్, గ్యాస్‌) 
కదులుతూ వేగంగా తినడం వల్ల ఆహారంతోపాటు ఎక్కువ మొత్తంలో గాలి కూడా కడుపులోకి వెళుతుంది. ఇది కడుపులో ఉన్నప్పుడు, గ్యాస్‌ నొప్పులను కలిగిస్తుంది. ఫలితంగా తరచు తేన్పులు వస్తాయి.

మానసిక తృప్తి ముఖ్యం  
ప్రశాంతంగా తిన్నప్పుడే ఆ హారం రుచి, సువాసన మనసుకు తృప్తినిస్తాయి. హడావుడిగా తినడం వల్ల కడుపు నిండినట్టు అనిపించినా, మానసికంగా ఇంకా ఏదో తినాలనే కోరిక మిగిలిపోతుంది. కాబట్టి రోజులో ఎంత పని ఉన్నా.. భోజనానికి కాస్త సమయం కేటాయించడం మంచిది. 

#

Tags : 1

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు