Breaking News

అసోంలో భూకంపం..

Published on Mon, 01/05/2026 - 05:02

ఈశాన్య భారతదేశంలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అసోం రాష్ట్రంతో పాటు మెఘాలయ, అరుణాచలప్రదేశ్, ఇతర ప్రాంతాల్లో కూడా భూకంపం ప్రభావం స్పష్టంగా కనిపించింది.  నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ సమాచారం ప్రకారం, రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. ఈ భూకంపం జనవరి 5, 2026న ఉదయం 04:17:40 గంటలకు సంభవించింది.  భూకంప కేంద్రం అసోంలోని మోరీగావ్ (Morigaon) ప్రాంతంగా గుర్తించారు. భూకంపం భూమి అడుగున సుమారు 50 కిలోమీటర్ల లోతులోసంభవించింది. ఖచ్చితమైన స్థానం అక్షాంశం 26.37 N , రేఖాంశం 92.29 E వద్దగా నమోదు చేశారు.  

అసోం, మెఘాలయ, అరుణాచలప్రదేశ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల పలు ప్రాంతాల్లో భూకంపం కారణంగా ప్రజలు భయానికి గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెల్లవారుజామున వచ్చిన ఈ ప్రకంపనలు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. అయితే ఇప్పటివరకు ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. స్థానిక అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ భూకంపం ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలను ఒక్కసారిగా భయాందోళనలకు గురి చేసినప్పటికీ, పెద్దగా నష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)