Breaking News

Earthquake: అస్సాంలో భూకంపం.. తీవ్రత ఎంతంటే..

Published on Thu, 02/27/2025 - 07:34

గౌహతి: ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో భూమి కంపించింది. ఈరోజు (గురువారం) తెల్లవారుజామున 2:25 గంటలకు 5.0 తీవ్రతతో భూ ప్రకంపనలు(Earthquake) చోటుచేసుకున్నాయి. ఇది సంభవించినప్పుడు చాలా మంది గాఢ నిద్రలో ఉన్నారు. అయితే  ఈ ప్రకంపనలు వారిని నిద్ర నుంచి మేల్కొలిపి, ఇళ్ల నుంచి బయటకు పరుగెత్తేలా చేశాయి.

భూకంప కేంద్రం అస్సాం(Assam)లోని మోరిగావ్‌లో ఉన్నట్లు గుర్తించారు. గౌహతితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. మోరిగావ్‌లో 16 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్‌) తెలిపింది. అయితే, ఈ ప్రకంపనల కారణంగా ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు తెలియరాలేదు.
 

ఎన్‌సీఎస్‌ తెలిపిన వివరాల ప్రకారం అస్సాంతో పాటు, మేఘాలయ(Meghalaya), పశ్చిమ బెంగాల్, బీహార్ వరకు భూ ప్రకంపనలు కనిపించాయి. భూకంపం భయంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ డేటా ప్రకారం భూకంపాల పరంగా ఈశాన్య భారతదేశం జోన్- 5లోకి వస్తుంది. ఇటువంటి జోన్ 5లో తేలికపాటి నుండి మితమైన తీవ్రతతో భూకంపాలు సంభవిస్తుంటాయి. 

ఇది కూడా చదవండి: ఆకట్టుకున్న మహా కుంభమేళా చివరి హారతి

Videos

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!