Breaking News

మేఘాలయ, అసోం సరిహద్దుల్లో భూప్రకంపనలు

Published on Sun, 07/12/2026 - 13:45

gన్యూఢిల్లీ: మేఘాలయ కేంద్రంగా ఆదివారం సంభవించిన భూకంపం వల్ల గౌహతి దాని పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మేఘాలయలో మధ్యస్థాయి భూకంపం సంభవించింది. ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం 12:00 గంటలకు మేఘాలయలోని ఈస్ట్ గారో హిల్స్ జిల్లా కేంద్రంగా 4.5 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది.

మధ్యస్థాయిలో వచ్చిన ఈ ప్రకంపనలు గౌహతితో పాటు అసోంలోని పలు ప్రాంతాల్లో కనిపించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ లో వెల్లడించిన వివరాల ప్రకారం.. మేఘాలయలోని ఈస్ట్ గారో హిల్స్‌లో భూమికి 5 కిలోమీటర్ల లోతులో 4.5 తీవ్రతతో ఈ భూకంపం చోటుచేసుకుంది. దీనిపై కహిలిపారాకు చెందిన తనూజ అనే స్థానికురాలు స్పందిస్తూ.. ‘నేను వంటగదిలో పని చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా భూమి ప్రకంపించింది. ఒకటి రెండు సెకన్ల పాటు భూమి కంపిస్తున్నట్లు అనిపించింది. అంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని న్యూస్ లైవ్‌కు తెలిపారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రాంతాలతో పాటు షిల్లాంగ్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి. అయితే ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరిగినట్లు ఇప్పటివరకు ఎలాంటి నివేదికలు అందలేదు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)