Breaking News

29 సీబీఎస్‌ఈ స్కూళ్లలో డమ్మీ విద్యార్థులు

Published on Fri, 12/20/2024 - 17:28

న్యూఢిల్లీ: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) అధికారుల ఆకస్మిక తనిఖీల్లో ‘డమ్మీ’ విద్యార్థుల బాగోతం బయటపడింది. ఆయా సీబీఎస్‌ఈ అఫిలియేటెడ్‌ పాఠశాలల్లో వాస్తవ విద్యార్థుల సంఖ్యకు మించి ఎన్‌రోల్‌మెంట్‌ ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీ, బెంగళూరు, వారణాసి, బిహార్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలోని మొత్తం 29 పాఠశాలల్లో ఇలాంటి దందా జరుగుతున్నట్లు తేల్చారు. బాధిత పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు. మౌలిక సదుపాయాల లేమి వంటి ఇతర నిబంధనల తీవ్ర ఉల్లంఘనకు పాల్పడిన ఈ పాఠశాలల యాజమాన్యాలపై న్యాయపరంగానూ చర్యలు తీసుకోనున్నారు.

బుధ, గురువారాల్లో 29 బృందాలు ఈ మేరకు తనిఖీలు చేపట్టాయని సీబీఎస్‌ఈ కార్యదర్శి హిమాన్షు గుప్తా చెప్పారు. అవకతవకలను గుర్తించిన స్కూళ్లలో దేశ రాజధాని ఢిల్లీలోనివే 18 కాగా, వారణాసిలో మూడు, బెంగళూరు, పట్నా, అహ్మదాబాద్, బిలాస్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లలో రెండేసి చొప్పున ఉన్నాయన్నారు. ఇంజినీరింగ్, మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రిపేరయ్యే విద్యార్థుల్లో కొందరు డమ్మీ స్కూళ్లలో ప్రవేశాలు పొంది, పరీక్షలకు సిద్ధమయ్యేందుకే పూర్తి సమయం కేటాయిస్తున్నారు.

తరగతులకు హాజరు కాకుండా వీరు నేరుగా బోర్డ్‌ పరీక్షలు రాసేలా ఆయా స్కూళ్లు వీరికి వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఏయే రాష్ట్రాల్లో మెడికల్‌ లేదా ఇంజినీరింగ్‌ సీట్లు పొందేందుకు అవకాశం ఉంటుందో చూసుకుని మరీ సంబంధిత ప్రాంతాల్లోని డమ్మీ స్కూళ్లలో ప్రవేశాలు తీసుకుంటున్నారు. 

చ‌ద‌వండి: కొబ్బరినూనెపై ‘పన్ను’ వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)