Breaking News

మణిపూర్‌ హింస వెనుక డ్రగ్‌ మాఫియా?

Published on Wed, 05/10/2023 - 17:23

ఢిల్లీ: మణిపూర్‌లో గిరిజనులు-గిరిజనేతరుల నడుమ చెలరేగిన వివాదాలు.. తీవ్ర హింసకు దారి తీశాయి. అల్లర్ల మూలంగా 60 మంది సాధారణ పౌరులు బలికాగా.. 300 మందిదాకా గాయపడ్డారు. పరిస్థితి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోందని మణిపూర్‌ హోంశాఖ ప్రకటించుకుంది. ఈ తరుణంలో మణిపూర్‌ హింస వెనుక మరో కారణం ఉందని ఓ ప్రొఫెసర్‌ అనుమానిస్తున్నారు.   

మణిపూర్ అల్లర్ల వెనుక డ్రగ్ మాఫియా హస్తం ఉండొచ్చని అంటున్నారు జేఎన్‌యూ ప్రొఫెసర్ భగత్ ఓయినమ్‌. తాజాగా.. ఢిల్లీ ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్‌లో హింస చెలరేగడానికి గల కారణాలని విశ్లేషించారు.  బీజేపీ ప్రభుత్వం డ్రగ్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపుతోంది. ఆ దెబ్బకు విలవిలలాడిపోయిన మాఫియా.. మణిపూర్‌లో హింసకు కారణం అయ్యిందన్నారు.  

ఇక.. కుకీ వర్గం తమ ఉనికి గురించి ఆందోళన చెందడం కూడా హింసకు మరో కారణమని అన్నారాయన.  కుకీ వర్గం మయన్మార్‌ నుంచి అక్రమంగా మణిపూర్‌కు వలస వచ్చిందని ఆరోపించాయారన. మెయితీ కమ్యూనిటీకి గనుక ఎస్టీ హోదా లభిస్తే..  తమ ఉనికి ప్రమాదంలో పడుతుందని, తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని కుకీ కమ్యూనిటీ అభద్రతా భావంలోకి కూరుకుపోయింది. అందుకే మెయితీలతో ఘర్షణకు దిగి.. మణిపూర్‌ కల్లోలానికి కారణమైందని తెలిపారాయన. 

మే 3వ తేదీన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మునుపెన్నడూలేని రీతిలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ అగ్గికి ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడింది. అప్రమత్తమైన మణిపూర్‌ సర్కార్‌.. ఎక్కడికక్కడ పోలీసు బలగాలను మోహరించి 144 సెక్షన్ విధించారు. మణిపూర్ సీఎం అభ్యర్ధన మేరకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అప్పటికప్పుడు స్పందించి పారా మిలటరీ బలగాలను మణిపూర్లో మోహరించి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. ఎంతగా పరిస్థితిని చక్కదిద్దినా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రాణ నష్టంతో పాటు సుమారు 1,500 నివాసాలు  ధ్వంసమై ఆస్తినష్టం వాటిల్లింది.

ఇదీ చదవండి: ఎమ్మెల్యేల డిష్యుం.. డిష్యుం. ఎందుకో తెలుసా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)