30 కిలోల ఆహారంతో ఇంటిపై కూలిన డ్రోన్‌!

Published on Sat, 02/17/2024 - 08:07

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఆహారాన్ని తరలిస్తున్న   ఒక డ్రోన్‌ కలకలం సృష్టించింది. సౌత్ సిటీలోని జి బ్లాక్‌ మీదుగా ఆహారాన్ని తీసుకువెళుతున్న ఆ డ్రోన్‌  హఠాత్తుగా ఒక ఇంటిపై పడిపోయింది. 

ఈ ఘటనలో సుమారు 30 కిలోల బరువున్న ఆహార పదార్థాలు ఆ ఇంటిపై పడటంతో పాటు ఇంటి బాల్కనీ, డిష్ యాంటెన్నా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో ఎవరూ ఇంటి బాల్కనీలో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. అకస్మాత్తుగా హౌస్‌ నంబర్ జి-68 పైనుండి పెద్ద శబ్దం వచ్చింది.   ఇంటి యజమాని బయటకు వచ్చి చూసేసరికి డ్రోన్ శిథిలాలు, మరికొన్ని వస్తువులు అక్కడ పడి ఉన్నాయి. 

ఆహార సరఫరా కోసం డ్రోన్ల ట్రయల్ జరుగుతున్నదని. ఇందుకోసం అధికారుల నుంచి  అనుమతులు కూడా తీసుకున్నట్లు ఆ కంపెనీ ఉద్యోగులు పోలీసులకు తెలిపారు. ఇంటికి జరిగిన నష్టానికి పరిహారం అందజేస్తామని ఆ కంపెనీ తెలిపింది. మరోవైపు ఈ ప్రాంతంలో  ప్రధాని పర్యటన సందర్భంగా డ్రోన్‌లను ఎగురవేయడంపై జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది. ఇదే సమయంలో డ్రోన్లను ఎగురవేసేందుకు ఆ కంపెనీకి అనుమతి ఎలా లభించిందనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. 

అయితే నిషేధ ఉత్తర్వుల గురించి తెలుసుకున్న డ్రోన్‌ పైలట్ ఈ భవనంపై అత్యవసర ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించాడని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉదంతంపై ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం డ్రోన్‌లోని సాంకేతిక లోపం కారణంగా అది కూలిపోయింది. ఈ ఘటనపై సెక్టార్ 50 పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ జితేంద్ర కుమార్ మాట్లాడుతూ పాడైన డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నమన్నారు. అలాగే సదరు కంపెనీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)