Breaking News

వాటర్‌ డ్రోన్‌ పరీక్ష సక్సెస్‌

Published on Tue, 04/01/2025 - 05:57

న్యూఢిల్లీ: భారత నావికాదళ అమ్ములపొదిలోకి మరో కొత్త అస్త్రం వచ్చి చేరబోతోంది. సముద్రజలాల్లో శత్రు దేశాల యుద్ధనౌకలపై ఓ కన్నేసి, నిఘాను అత్యంత సమర్థవంతంగా నిర్వహించే అధునాతన‘వాటర్‌ డ్రోన్‌’ను రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. అన్ని దశల పరీక్షలను పూర్తిచేసుకున్నాక ఇది భారత నౌకాదళాల చేతికి రానుంది. దీంతో సముద్రజలాలపై ఉపరితల నిఘా కార్యకలాపాల్లో భారత్‌ సామర్థ్యం ద్విగుణీకృతం కానుంది.

 నీటిలో కాస్తంత మునిగి కనిపించకుండా దూసుకెళ్లే హై ఎండ్యూరన్స్‌ అటానమస్‌ అండర్‌వాటర్‌ వెహికల్‌ (హెచ్‌ఈ ఏయూవీ)ను విజయవంతంగా పరీక్షించినట్లు డీఆర్‌డీవో సోమవారం ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యం ‘ఎక్స్‌’లోని తన ఖాతాలో ఒక ప్రకటన విడుదలచేసింది. జలాంతర్గామిలా కనిపించే అత్యంత చిన్న స్వయంచాలిత వాహనాన్ని వాటర్‌ డ్రోన్‌గా పిలుస్తారు. 

సరస్సులో వాటర్‌ డ్రోన్‌ను పరీక్షిస్తున్న వీడియోను డీఆర్‌డీఓ తన ‘ఎక్స్‌’ సామాజిక మాధ్యమ ఖాతాలో పోస్ట్‌చేసింది. ఉపరితలంలో, కాస్తంత మునిగి ప్రయాణిస్తూ ఈ అటానమస్‌ వెహికల్‌ నిర్దేశిత పరామితులను అందుకుందని సంస్థ పేర్కొంది. సోనార్, కమ్యూనికేషన్‌ సామర్థ్యాలను అత్యంత కచ్చితత్వంతో ప్రదర్శించిందని ప్రకటించింది. నావల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలాజికల్‌ లేబొరేటరీ ఈ వాటర్‌ డ్రోన్‌ను అభివృద్ధిచేసింది. 

దాదాపు 6 టన్నులు బరువు ఉండే ఈ డ్రోన్‌ పొడవు 9.75 మీటర్లు. శత్రువుల యుద్ధనౌకల సిబ్బంది కంట్లోపడకుండా నీటి ఉపరితలంపై పెద్దగా అలల అలజడి సృష్టించకుండా నిశ్శబ్దంగా, మెల్లగా ముందుకెళ్తుంది. అత్యవసర సందర్భాల్లో గంటకు గరిష్టంగా 14 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. దాక్కోవాల్సిన పరిస్థితుల్లో సముద్రజలాల్లో ఏకంగా 300 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. సమీపంలో సంచరించే భారత జలాంతర్గాముల రక్షణ, అన్వేషణ సామర్థ్యాలను సైతం ఈ వాటర్‌డ్రోన్‌ మెరుగుపరుస్తుందని డీఆర్‌డీవో పేర్కొంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)