Breaking News

రూ.5 లక్షలు కాదు..  కోటి ఇవ్వాల్సిందే

Published on Sat, 06/07/2025 - 06:23

ముంబై: గృహ హింస బాధితురాలిగా ఉన్న ఓ మహిళకు ఇవ్వాల్సిన పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.కోటికి పెంచుతూ ముంబైలోని ఓ సెషన్స్‌ కోర్టు తీర్పు వెలువరించింది. ఎలివేటర్‌ కంపెనీని నడిపే ఈమె భర్త వద్ద భారీగానే డబ్బుందని, అతడిది కోటీశ్వరుల కుటుంబమని వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ తన భర్తతో కలిసి ఉన్న సుదీర్ఘమైన 20 ఏళ్ల సమయంలో అనూహ్యమైన శారీరక, మానసిక హింస ఎదుర్కొన్నారని పేర్కొన్న న్యాయస్థానం..నిర్వహణ ఖర్చుల కింద భార్య, కుమార్తెకు నెలకు భర్త ఇచ్చే మొత్తాన్ని సైతం రూ.లక్ష నుంచి రూ.లక్షన్నరకు పెంచింది. 

మేజి్రస్టేట్‌ కోర్టు 2020లో ఇచి్చన తీర్పును సవాల్‌ చేస్తూ బాధితురాలు(41) వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన డిండోషి లోని అదనపు సెషన్స్‌ జడ్జి ఎస్‌జే అన్సారీ గత నెలలో గృహ హింస నిరోధక చట్టం కింద ఈ మేరకు తీర్పు వెలువరించారు. 1997లో వివాహమైనప్పటి నుంచి పిటిషనర్‌ అయిన బాధితురాలిని భర్త, అతడి కుటుంబం శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తీవ్ర వేదనకు, అవమానాలకు గురి చేశారని జడ్జి అన్సారీ తీర్పులో పేర్కొన్నారు. చిట్టచివరి ప్రయత్నంగా బాధితురాలు భరణ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. 

భార్య కారణంగా తాను ఆర్థికంగా చితికిపోయానని, ఇద్దరు కుమారుల చదువులు, పోషణ కోసం ఎంతో ఇబ్బందులు పడుతున్నానని, ఉండే ఇంటికి అద్దె సైతం చెల్లించలేని స్థితిలో ఉన్నానంటూ భర్త చేసిన వినతిని జడ్జి తోసిపుచ్చారు. ఇందుకు సంబంధించిన ఎటువంటి ఆధారాలను చూపలేకపోయారని ఎత్తి చూపారు. 2012లో కోటి విలువ చేసే భూమిని కొనుగోలు చేయడంతోపాటు ఎలివేటర్‌ కంపెనీ నడుపుతున్న అతడి వద్ద డబ్బు మూలుగుతోందని వ్యాఖ్యానించారు. ‘పిటిషనర్‌ ఇప్పుడు తన ఇద్దరు కుమారుల నుంచి దూరంగా ఉంటూ వేదన అనుభవిస్తున్నారు. ఆ కుమారులిద్దరినీ తల్లికి వ్యతిరేకంగా భర్త మార్చినట్లు కూడా కనిపిస్తోంది. ఇది విస్మరించలేని అంశం’అని న్యాయమూర్తి పేర్కొన్నారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే పరిహారంతో పాటు మహిళకు, ఆమె కుమార్తెకు మంజూరు చేసిన భరణం మొత్తాన్ని కూడా పెంచామని స్పష్టం చేశారు.  

 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)