Breaking News

కుక్కను కారులోనే వదిలి తాజ్‌మహల్‌ చూసి వచ్చారు.. తిరిగొచ్చి చూస్తే..  

Published on Mon, 07/03/2023 - 17:23

ఆగ్రా: తాజ్‌మహల్‌ సందర్శించడానికి వెళ్లిన ఒకతను తన వెంట పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్లి కారులోనే వదిలి వెళ్లడంతో ఆ వేడికి ఊపిరాడక చనిపోయిన సంఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది. 

వేసవి సెలవుల్లో హర్యానా నుండి తాజ్‌మహల్‌ని సందర్శించడానికి వెళ్లిన ఒక పెద్దమనిషి కార్లో తనతో పాటు తన పెంపుడు కుక్కను కూడా తీసుకుని వెళ్ళాడు. తాజ్‌మహల్‌ అందాలను ఆస్వాదించే సమయంలో అడ్డుగా ఈ శునకం ఎందుకు అనుకున్నాడో ఏమో పాపం ఆ మూగ జీవిని కారులోనే బంధించి పార్కింగ్ చేసి వెళ్ళిపోయాడు. 

ఆ వ్యక్తి తాజ్‌మహల్‌ అందాలను తనివితీరా ఆస్వాదించి తిరిగొచ్చి చూసే సరికి కారులో తన పెంపుడు కుక్క విగతజీవిగా కనిపించింది.  కారులో బంధించిన ఆ కుక్క గంటల తరబడి పార్కింగ్లో ఎండ వేడిమికి తట్టుకోలేక ఊపిరాడక చనిపోయింది. భగభగ మండే ఎండలను మనుషులే తట్టుకోలేకపోతుంటే పాపం ఆ మూగజీవం ఏం భరిస్తుంది? వేసవితాపానికి విలవిలలాడి ప్రాణాలు విడిచింది. 

ఈ సంఘటన తాలూకు హృదయవిదారకమైన  వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఒకాయన.. పెంపుడు జంతువులను చేరదీయడం చేతకాకపొతే వాటిని పెంచుకునే ప్రయత్నం చేయకండి అని హితవు పలికాడు.  

ఇది కూడా చదవండి: టైటాన్ విషాదం: నా భర్త, బిడ్డ చివరి రోజులు తలచుకుంటే.. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)