Breaking News

TN: మంత్రి పదవికి సెంథిల్‌ బాలాజీ రాజీనామా

Published on Tue, 02/13/2024 - 08:52

చెన్నై: మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయి జైలులో ఉన్న తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీ మంగళవారం ఉదయం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని డీఎంకే పార్టీ వర్గాలు ధృవీకరించాయి. మరో రెండు రోజుల్లో మద్రాస్‌ హైకోర్టులో బాలాజీ బెయిల్‌ పిటిషన్‌ విచారణకు రానున్న నేపథ్యంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయడం​ చర్చనీయాంశమైంది.

న్యాయపరమైన చిక్కుల వల్లే బాలాజీ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది జూన్‌ 14న మనీలాండరింగ్‌ కేసులో బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)అరెస్టు చేసింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో బాలాజీపై చెన్నై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు క్యాష్‌ ఫర్‌ జాబ్‌ స్కామ్‌ కేసు నమోదు చేశారు.

ఈ కేసులో మనీలాండరింగ్‌ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ  బాలాజీని అరెస్టు చేసింది. అరెస్టయి జైలులో ఉన్నప్పటికీ బాలాజీని సీఎం స్టాలిన్‌ మంత్రివర్గంలోనే కొనసాగించారు. పోర్ట్‌ఫోలియో మాత్రం కేటాయిం‍చలేదు. అయితే దీనిపై హైకోర్టు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది. బాలాజీని మంత్రి పదవిలో కొనసాగించే విషయమై మరోసారి ఆలోచించాలని సీఎం స్టాలిన్‌కు కోర్టు సూచించింది. దీంతో బెయిల్‌ పిటిషన్‌ రెండోసారి హైకోర్టు ముందు విచారణకు రానున్న నేపథ్యంలో బాలాజీ మంత్రి పదవికి రాజీనామా చేయడం గమనార్హం.  

ఇదీ చదవండి.. హస్తినలో హై టెన్షన్‌ 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)