Breaking News

పార్లమెంట్‌లో టీ–షర్టుల రగడ

Published on Fri, 03/21/2025 - 04:19

న్యూఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై విపక్ష సభ్యులు గొంతెత్తారు. గురువారం లోక్‌సభలో తీవ్ర అలజడి సృష్టించారు. ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రయత్నించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించబోమని హెచ్చరించారు. తమిళనాడుకు చెందిన డీఎంకే సభ్యులు సభలో టీ–షర్టులు ధరించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది.

నియోజకవర్గాల పునర్విభజనపై చర్చకు అనుమతి ఇవ్వాలని విపక్ష సభ్యులు కోరగా, స్పీకర్‌ ఓం బిర్లా తిరస్కరించారు. ప్రస్తుతానికి ఆ అంశం ప్రభుత్వ పరిశీలనలో లేదని, దానిపై ఇప్పుడు చర్చ అక్కర్లేదని తేల్చిచెప్పారు.  నినాదాలు రాసి ఉన్న టీ–షర్టులు ధరించి సభకు వచ్చిన డీఎంకే ఎంపీలపై ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. నిబంధనలు అతిక్రమించడం ఏమిటని మండిపడ్డారు. ఎవరైనా సరే సభా సంప్రదాయాలు పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు. సభ గౌరవాన్ని కాపాడాలని అన్నారు.

బయటకు వెళ్లి దుస్తులు మార్చుకొని రావాలని డీఎంకే సభ్యులకు సూచించారు. ఎంపీలకు గౌరవప్రదమైన వేషధారణ అవసరమని హితవు పలికారు. మధ్యా హ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. విపక్ష ఎంపీలు నినాదాలు కొనసాగించారు. సభ సజా వుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్‌ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణ ప్రసాద్‌ పదేపదే కోరినా విపక్ష సభ్యులు శాంతించలేదు. దీంతో సభను శుక్రవారానికి కృష్ణ ప్రసాద్‌ వాయిదా వేశారు.

రాజ్యసభలోనూ అదే తీరు  
పార్లమెంట్‌ ఎగువ సభలోనూ టీ–షర్టుల రభస చోటుచేసుకుంది. డీఎంకే ఎంపీలు నినాదాలు రాసిన టీ–షర్టులు ధరించి సభకు వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. ‘‘పునర్విభజన–తమిళనాడు పోరాటం సాగిస్తుంది. కచ్చితంగా విజయం సాధిస్తుంది’’ అని ఆ టీ–షర్టులపై రాసి ఉంది. ‘అనాగరికులు’ అంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేసిన వ్యాఖ్యలను డీఎంకే ఎంపీలు తప్పుపట్టారు. తమ టీ–షర్టులపై ‘అన్‌సివిలైజ్డ్‌’ అని రాసుకున్నారు. నినాదాలు ఆపేసి సభా కార్యకలాపాలకు సహకరించాలని చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ పలుమార్లు కోరినా, డీఎంకే ఎంపీలు వెనక్కి తగ్గలేదు.

దాంతో సభ పలుమార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం పునఃప్రారంభమైన తర్వాత కూడా సభ అదుపులోకి రాకపోవడంతో చైర్మన్‌ మరుసటి రోజుకి వాయిదా వేశారు.  రెండో విడత బడ్జెట్‌ సమావేశాల్లో సభ నిష్ప్రయోజనంగా మారడం ఇదే మొదటిసారి. అంతకుముందు వివిధ పార్టీల సభా నాయకులతో చైర్మన్‌ ధన్‌ఖడ్‌ తన చాంబర్‌లో భేటీ అయ్యారు.

సభలో టీ–షర్టులు ధరించకూడదని డీఎంకే సభ్యులకు సూచించారు. అలాంటి దుస్తులతో పార్లమెంట్‌కు రావడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టంచేశారు. అయితే, సభలో టీ–షర్టులు కచ్చితంగా ధరిస్తామని, నిరసన తెలియజేస్తామని డీఎంకే ఎంపీలు బదులిచ్చారు. సభ నుంచి సస్పెండ్‌ చేసినా తమకు అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు.

#

Tags : 1

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)