Breaking News

ఆలయానికి వచ్చిన నలుగురు నేతలు సీఎంలయ్యారు

Published on Wed, 06/03/2026 - 11:34

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సర్కార్‌లో ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ ఖచ్చితంగా బాధ్యతలు చేపడతారని ఆనాడే జోస్యం చెప్పామని గాణదాళ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం అర్చకుడు శ్యామాచారి గుర్తుచేశారు గతంలో ఈ ఆలయాన్ని సందర్శించిన నేతల్లో నలుగురు సీఎం పీఠాన్ని అధిరోహించారన్నారు. 

మంగళవారం రాయచూరు తాలూకా పంచముఖి గాణదాళ ఆంజనేయ ఆలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది అక్టోబరులో రాయచూరు జిల్లా పర్యటనలో భాగంగా గాణదాళ పంచముఖి ఆంజనేయ స్వామికి శివకుమార్‌ దంపతులు ప్రత్యేక పూజలు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు.  

కాగా.. గాణదళ పంచముఖీ ఆంజనేయ స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. మధ్వమతాచార్యుడు గురు రాఘవేంద్రస్వామి ఇక్కడే 16 సంవత్సరాలు తపస్సు చేసి, పంచముఖీ హనుమంతుడిని ప్రసన్నం చేసుకున్నట్లు చెబుతారు. త్రేతాయుగంలో.. రామ-రావణ సంగ్రామం సమయంలో.. రామలక్ష్మణులను మైరావణుడు అపహరించి, పాతాళానికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే..! వారిని కాపాడేందుకు హనుమంతుడు గాణదళ నుంచే పాతాళానికి వెళ్లినట్లు స్థానికులు చెబుతారు. మైరావణుడి ప్రాణం అయిదు భ్రమరాల్లో ఉండడంతో.. వాటిని ఏకకాలంలో చంపేందుకు హనుమంతుడు పంచముఖీ ఆంజనేయస్వామి అవతారమెత్తినట్లు చెబుతారు. ఇక్కడ హనుమంతుడి కోసం కుట్టే భారీ తోలుచెప్పులు ప్రతీ ఐదేళ్ల కోసారి అరిగిపోవడం విశేషం. 

 

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)