Breaking News

ఎలక్ట్రానిక్‌ ఫైర్‌క్రాకర్స్‌.. సురక్షితం.. కాలుష్య రహితం

Published on Wed, 10/30/2024 - 12:17

దేశంలో గత కొన్నేళ్లుగా  దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడంపై పలు ఆంక్షలు విధించారు. బాణసంచా నుండి వెలువడే పొగ ఆరోగ్యానికి హానిచేస్తుంది. అలాగే కాలుష్యాన్ని కూడా వ్యాపింపజేస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే బాణసంచా కొనుగోళ్లు, అమ్మకాలను నిషేధించారు.

అయితే దీపావళి వేళ బాణసంచా లేకుండా సరదాగా ఎలా గడపడం? ఇది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇప్పుడు బాణసంచాకు బదులుగా ఎలక్ట్రానిక్‌ ఫైర్‌క్రాకర్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఇవి వెలుగు జిలుగులను, ధ్వనిని అందించినప్పటికీ కాలుష్యాన్ని కలుగజేయవు. ఎలక్ట్రానిక్‌ ఫైర్‌క్రాకర్స్‌ను కాల్పడం వలన ఎటువంటి హాని జరగదు.

ఎలక్ట్రానిక్ టపాసులు నిజమైన టపాసుల మాదిరిగనే కనిపిస్తాయి. వాటిలానే వెలుగులను ఇస్తాయి. అయితే ఇవి రిమోట్‌తో పనిచేస్తాయి. వీటిని వినియోగించినప్పుడు నిజమైన బాణసంచాను కాల్చిన అనుభూతినే పొందవచ్చు. ఎలక్ట్రానిక్ టపాసులు వెలిగించేందుకు ఎటువంటి అగ్గిపెట్టె లేదా నిప్పు అవసరం లేదు. ఇవి ఎంతో సురక్షితమైనవి. కాలుష్యాన్ని కూడా వెదజల్లవు. ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్‌లో వివిధ రకాల శబ్ధాలు, వెలుగులను చూడవచ్చు.

 

ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్‌ లోపల వైర్లతో అనుసంధానమైన పలు చిన్న పాడ్‌లు, ఎల్‌ఈడీ లైట్లు  ఉంటాయి. వీటిని ఆన్ చేసినప్పుడు పాడ్‌ల నుంచి స్పార్క్  వస్తుంది.  అలాగే బాణసంచా మాదిరి శబ్దం కూడా వస్తుంది. ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్‌ను  రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు. ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్‌ను వినియోగించి వినూత్నమైన దీపావళి  ఆనందాన్ని పొందవచ్చు.

ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్‌ను మార్కెట్‌లో లేదా ఆన్‌లైన్‌లో సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఇవి కొంచెం ఖరీదైనవే అయినప్పటికీ పర్యావరణానికి  ఎటువంటి హాని చేయవు. వీటిని పలుమార్లు ఉపయోగించవచ్చు. వీటిధర రూ.2,500 వరకూ ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో దీపావళి వెలుగులు

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)