Breaking News

దీపావళి వేడుకలు: అయోధ్య నుంచి అమృత్‌సర్‌ వరకూ..

Published on Wed, 10/30/2024 - 13:45

దీపావళి.. దివ్యకాంతుల మధ్య జరుపుకునే ఆనందాల పండుగ. మన దేశంలోని అందరూ జరుపుకునే అతి పెద్ద పండుగ దీపావళి. దేశంలోని వివిధ ప్రాంతాలలో దీపావళికి ప్రత్యేక సంప్రదాయాలనున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను భావిస్తారు. అయోధ్యలో ఈ ఏడాది దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే పలు ప్రధాన నగరాల్లోనూ దీపావళి వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి.

అయోధ్య
ఈ ఏడాది ప్రపంచమంతా అయోధ్యలో జరిగే దీపావళి వేడుకలను చూసేందుకు పరితపిస్తోంది. అయోధ్య శ్రీరాముని జన్మస్థలం. 500 ఏళ్ల తరువాత శ్రీరాముడు ఇక్కడ ప్రతిష్టితుడయ్యాడు. రామాయణంలోని వివరాల ప్రకారం శ్రీరాముడు రావణాసురుడిని ఓడించి 14 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా దీపావళి వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది దీపావళికి అయోధ్యలో 28 లక్షల దీపాలు వెలిగించి, ప్రపంచ రికార్డు నెలకొల్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వారణాసి
కాశీ అని కూడా పిలిచే వారణాసి భారతదేశానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచంలోని పురాతన నగరాలలో వారణాసి ఒకటి. ఇక్కడి గాలిలో ఆధ్యాత్మిక శక్తి ‍ప్రవహిస్తుంటుంది. ప్రతి సంవత్సరం దీపావళికి లక్షలాది మంది భక్తులు వారణాసికి తరలివస్తుంటారు. ఇక్కడ దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి.

ఉదయపూర్
రాజస్థాన్‌లోని  ఉదయపూర్‌ నగరం సరస్సుల నగరంగా పేరొందింది. ఇక్కడ కూడా దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. నగరంలోని వీధులను రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు. సరస్సుల ఒడ్డున ఉన్న ప్యాలెస్‌లు విద్యుత్‌ దీపకాంతులతో వెలుగొందుతుంటాయి. ఉదయపూర్‌లోని పలు ప్రాంతాల్లో బాణసంచా కాల్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

అమృత్‌సర్
అమృత్‌సర్‌లో దీపావళి వేడుకలు భిన్నమైన అనుభూతిని అందిస్తాయి. స్వర్ణ దేవాలయంలో దీపావళి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దీపావళి నాడు గ్వాలియర్ కోట నుండి ఆరవ సిక్కు గురువుతో పాటు 52 మంది ఇతర ఖైదీలను విడుదల చేసిన రోజును సిక్కు సోదరులు గుర్తు చేసుకుంటారు. గోల్డెన్ టెంపుల్ కూడా బంగారు దీపాలతో ప్రకాశవంతంగా మారిపోతుంది.

కోల్‌కతా
పశ్చిమబెంగాల్‌లో దీపావళి నాడు  కాళీ పూజలు నిర్వహిస్తారు. అమావాస్య రాత్రివేళ కాళీ పూజలు చేస్తారు. దీంతో దీపావళి రాత్రి వేళ నగరం దీపకాంతులతో శోభాయమానంగా మారిపోతుంది.

ఇది కూడా చదవండి: వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో దీపావళి వెలుగులు

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)