Breaking News

ఓరి దేవుడో.. ఇవేం ఎండలు! వడదెబ్బకు 54 మంది మృతి

Published on Sun, 06/18/2023 - 12:19

ఉత్తరప్రదేశ్‌: రాజస్థాన్‌లో బిపర్ జాయ్ తుపాను బీభత్సం సృష్టిస్తుంటే.. పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత మూడు రోజుల్లోనే బల్లియా జిల్లా ఆస్పత్రిలో 54 మంది మృతి చెందారు. దాదాపు 400 మంది తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన రోగులకు వేరువేరు కారణాలున్నప్పటికీ ఎండ తీవ్రత ఓ కారణమని వైద్యులు చెప్పారు.

రోజురోజుకూ వేడితీవ్రత ఎక్కువగా..ఆస్పత్రిలో చేరుతున్నవారి సంఖ్య పెరిగిపోతోందని తెలిపారు. రాష్ట్రంలో చాలా ప్రదేశాల్లో ఎండలు 40 డిగ్రీలపైనే నమోదవుతున్నాయని వెల్లడించారు. ఆస్పత్రిలో చేరుతున్న రోగుల్లో తీవ్రమైన జ్వరం, శ్వాసకోశ సమస్యలతో సహా పలు ఆరోగ్య సమస్యలను గుర్తించినట్లు పేర్కొన్నారు.

జూన్ 15న 23 మంది మరణించగా..ఆ మరుసటి రోజు 20 మంది మృతి చెందారు. కాగా.. శనివారం 11 మంది ప్రాణాలు పోయాయని జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ ఎస్‌కే యాదవ్ వెల్లడించారు. రోగుల ఆరోగ్య పరిస్థితికి ఏదైనా వ్యాధి కారకమా? అని తెలుసుకోవడానికి లక్నో నుంచి ఓ బృందం వస్తోందని అడినల్ హెల్త్ డైరెక్టర్ డా.బీపీ తివారీ తెలిపారు.

వేడి, చలి పెరిగినప్పుడు శ్వాసకోశ సమస్యలు, డయాబెటిస్, బీపీ విపరీతంగా పెరుగుతాయని వైద్యులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఎండలు పెరగడమే తాజా మృతులకు కారణమని వెల్లడించారు. ఆస్పత్రికి రోగుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో స్ట్రెచర్స్ లేమి కారణంగా రోగులను బంధువులు భుజాలపై మోసిన సందర్భాలు ఎదురయ్యాయని చెప్పారు. 
ఇదీ చదవండి:అల్పపీడనంగా మారుతున్న ‘బిపర్‌జోయ్‌’.. ఆ ‍ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)