Breaking News

డిజిటల్‌ కేఫ్‌.. కమ్మనైన ఆటలు, పసందైన టాస్క్‌లు లభ్యం

Published on Tue, 05/28/2024 - 12:17

ఉత్తరప్రదేశ్‌కు వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయాగ్‌రాజ్ మరో కొత్తదనాన్ని సింగారించుకుంది. ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ కొత్త సొబగును సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మొట్టమొదటి ఫ్లోటింగ్ రెస్టారెంట్, బోట్ క్లబ్, మొదటి ట్రాఫిక్ పార్క్ ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. తాజాగా ఈ జాబితాలో ఇ‍ప్పుడు డిజిటల్ కేఫ్ అందరికీ అందుబాటులోకి వచ్చింది.

ప్రయాగ్‌రాజ్‌లోని ట్రాఫిక్ పార్క్ లో ప్రారంభించిన ఈ డిజిటల్ కేఫ్‌కు అత్యధిక సంఖ్యలో యువత తరలివస్తున్నారు. ఈ కేఫ్‌లో అల్పాహారానికి బదులుగా డిజిటల్‌ గేమ్స్‌ అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం మూడు పెద్ద ఎల్‌ఈడీలు  ఏర్పాటు చేశారు.  ఇక్కడకు వచ్చేవారు సోఫాలపై కూర్చుని, హెడ్‌ఫోన్‌ పెట్టుకుని వీడియో గేమ్‌లను ఆడవచ్చు. టెంపుల్ రన్, బైక్ రేసింగ్, కార్ రేసింగ్ ఇలాంటి ఏ గేమ్‌ అయినా ఇక్కడ ఆడుకోవచ్చు.

ఈ పార్కులోకి ప్రవేశించేందుకు పిల్లలకు రూ.5, పెద్దలకు రూ.10 టిక్కెట్టుగా నిర్ణయించారు. డిజిటల్ కేఫ్, మోషన్ థియేటర్‌లకు  ఎంట్రీ ఫీజుగా రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పార్క్ ఉదయం 9:00 నుండి రాత్రి 9:00 వరకు తెరిచి ఉంటుంది. ఈ పార్కును ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ పర్యవేక్షిస్తున్నది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)