Breaking News

రైలులో వదంతులు.. కిందకు దూకి ప్రాణాలు కోల్పోయిన నలుగురు

Published on Sat, 06/15/2024 - 09:26

వదంతులు.. ఎంతటివారినైనా ఒకింత ఆలోచింపజేస్తాయి. అదే ప్రమాదానికి సంబంధించిన వదంతులైతే దాని పరిణాలమాలు ఊహించని విధంగా ఉంటాయి. జార్ఖండ్‌లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకోగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు

జార్ఖండ్‌లోని లాతేహార్‌లో రాంచీ-ససారం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్నదంటూ వదంతులు వ్యాపించడంతో ఆ రైలులోని పలువురు ప్రయాణికులు రైలు నుంచి దూకేశారు. ఈ సమయంలో ప్రయాణికులు అటుగా వస్తున్న గూడ్స్ రైలు ఢీకొన్నారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది అంబులెన్‌లో  ఘటనా స్థలానికి చేరుకున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ససారం-రాంచీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ కుమాండిహ్ స్టేషన్ సమీపానికి వచ్చిన సమయంలో ఒక ప్రయాణీకుడు రైలుకు నిప్పుంటుకున్నదంటూ నానా హంగామా చేశాడు. దీంతో ప్రయాణికుల్లో  భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే కొందరు ప్రయాణికులు రైలు నుంచి కిందుకు దూకేశారు. ఈ సమయంలో ఎదురుగా ఒక గూడ్స్ రైలు వస్తోంది. దానిని ఢీకొన్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడినట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం నేపధ్యంలో స్టేషన్‌లో ఉన్న ప్రయాణికుల్లోనూ ఆందోళన నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)